బెంట్లీ ఓనర్ల కోసం సరికొత్త స్మార్ట్‌ఫోన్; ధర రూ.10 లక్షలు మాత్రమే!

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న స్మార్ట్ ఫోన్‌ను చూశారా..! దీని ఖరీదు అక్షరాలా రూ.10 లక్షలు. హై-ఎండ్ లగ్జరీ సెల్‌ఫోన్లను తయారు చేయటంలో ప్రసిద్ధి చెందిన కంపెనీ 'వెర్టు' ఈ ఫోన్‌ను తయారు చేసింది. ప్రత్యేకించి బెంట్లీ లగ్జరీ కార్లను ఉపయోగించే యజమానులు మరియు బెంట్లీ బ్రాండ్ అంటే అభిమానం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని 'వెర్టు ఫర్ బెంట్లీ' అనే స్మార్ట్‌ఫోన్‌‌ను తయారు చేశారు.

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం కేవలం 2,000 వెర్టు ఫర్ బెంట్లీ స్మార్ట్‌ఫోన్లను మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందు భాగంలో క్రింది వైపు బెంట్లీ, పై వైపు వెర్టు లోగోలు ఎంబోస్ చేయబడి ఉంటాయి. ఈ ఫోన్‌ను గ్రేడ్ 5 టైటానియం కేసింగ్‌తో తయారు చేశారు.

New Smartphone For Bentley Owners

ఈ ఫోన్‌లో సౌండ్ ట్యూనింగ్ కోసం వెర్టు బ్యాంగ్ అండ్ ఓల్యుఫ్సెన్‌తోను, వెనుక వైపు అమర్చిన కెమెరా ట్వీకింగ్ కోసం హాజల్‌బ్లాడ్‌తోను చేతులు కలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని మెయిన్ కెమెరా కొత్త యాపిల్ ఐఫోన్లలో మాదిరిగా విర్చువల్లీ స్క్రాచ్-ప్రూఫ్ సఫైర్ క్రిస్టల్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులోని రింగ్‌టోన్స్ మరియు అలెర్ట్ సౌండ్స్‌ను లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా ట్యూన్ చేసింది

ఈ స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించే కస్టమర్లు, ఫోనులో ఏదైనా సమస్యను ఎదుర్కున్నట్లయితే, దానిని పరిష్కరించేందుకు వెర్టు ఓ ప్రత్యేకమైన సర్వీస్ సదుపాయాన్ని కూడా ఆఫర్ చేస్తోంది. ప్రయారిటీ బేసిస్ ప్రకారం, అందరి కన్నా ముందుగా సేవలు అందించడం జరుగుతుంది.


వెర్టు ఫర్ బెంట్లీ స్మార్ట్‌ఫోన్‌ను 1080x1920 రెజల్యూషన్‌తో 4.7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఇందులో 2.3 గిగా హెడ్జెస్ క్వాడ్-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. బ్యాటరీ విషయానికి వస్తే 2275 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు.

ఈ ఫోన్ అంతర్గత మెమరీ 64 జిబి, వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను మరియు ముందు వైపు 2.1 మెగాపిక్సెల్ కెమెరాను ఆఫర్ చేస్తున్నారు. ఇది వైర్‌లెస్ చార్జింగ్ సిస్టమ్‌ను, బ్లూటూత్ 4.0 ఎల్ఈ మరియు 4జి నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిండ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 15, 2014, 12:53 [IST]
English summary
World renowned luxury smartphone manufacturer Vertu has unveiled a €12,500 smartphone for Bentley owners and enthusiasts. Named as Vertu for Bentley, is the first device to come out of the new five-year partnership with the high-end British car maker.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+