వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి టాటా హారియర్. ఈ కొత్త ఎస్‌యూవీ ఇటీవల దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కొత్త హారియర్ విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా నిలిచింది.

వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

ఇదిలా ఉండగా భారతదేశంలో వాహన దొంగతనాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ దొంగతనాలు పార్కింగ్ ప్రదేశాల్లో, లేకుంటే ఇంటి ఆవరణలో ఉంచినప్పుడు దొంగలించినట్లు మనం ఇదివరకు కథనాల్లో చూసాం. అయితే ఇప్పుడు ఒక దొంగ ఏకంగా ఒక షోరూమ్ నుంచే దొంగిలించాడు.

వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

నివేదికల ప్రకారం గురుగ్రామ్‌లోని టాటా కార్ షోరూమ్ సమీపంలో టాటా హారియార్ కార్ దొంగలించబడింది. ఈ సంఘటన జూన్ 15 ఉదయం 5:30 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సమీపంలోని సిసిటివి ఫుటేజ్ లో రికార్డ్ చేయబడింది.

వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

దేశీయ మార్కెట్లో హారియార్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి, ఈ కారణంగా హారియర్ ఎస్‌యూవీకి కొత్త బ్యాచ్ జూన్ 13న టాటా మోటార్స్ షోరూమ్‌కు చేరుకుంది. కొత్త బ్యాచ్ చేరుకున్న కేవలం రెండు రోజుల్లో ఈ సంఘటన జరిగింది.

వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

టాటా మోటార్స్ షోరూమ్ జెడెక్స్ టాటా మోటార్స్, గురుగ్రామ్ లోని ఫాజిల్‌పూర్ చౌక్ సమీపంలో స్కాటిష్ మాల్ లో ఉంది. ఈ షోరూమ్ నుంచి హారియార్ దొంగలించబడింది. పార్కింగ్ స్థలం నుండి కారు దొంగిలించబడిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

కారు దొంగిలించిన దొంగ మెయిన్ రోడ్‌లోకి ప్రవేశించి అక్కడి నుంచి వేగంగా వెళ్లడం మీరు ఇక్కడ వీడియోలో గమనించవచ్చు. దొంగిలించబడినడి టాటా హారియర్ యొక్క ఎక్స్‌జెడ్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్. ఈ మోడల్ ధర రూ. 20 లక్షలకు పైగానే ఉంటుంది. కారు దొంగతనానికి సంబంధించి వివరాలను షోరూమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్వరలోనే ఈ దొంగను పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కొత్త కారుకి ఎటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు.

వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

టాటా హారియర్ ఎస్‌యూవీ యొక్క ప్రారంభ ధర రూ. 14.21 లక్షలు. ఈ ఎస్‌యూవీని ఆరు మోడళ్లలో విక్రయిస్తున్నారు. అవి ఎక్స్‌ఇ, ఎక్స్‌ఎమ్, ఎక్స్‌డి, ఎక్స్‌డి ప్లస్, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జడ్ ప్లస్ వేరియంట్లు. టాటా హారియార్ స్పెషల్ ఎడిషన్ లో కూడా లభిస్తుంది. అవి డార్క్ మరియు క్యామో ఎడిషన్స్.

ఈ స్పెషల్ ఎడిషన్స్ ప్రత్యేక రంగు, బ్యాడ్జ్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. టాటా హారియర్ ఎస్‌యూవీ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే విక్రయించబడుతుంది. కావున ఇందులో 2.0-లీటర్ కైరోటెక్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వామ్మో.. షోరూమ్ నుంచి దొంగలించబడిన టాటా హారియార్ [వీడియో]

టాటా హారియర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కారు విలాసవంతంగా ఉండటం వల్ల వాహనదారులకు హలా అనుకూలంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో కొత్త టాటా హారియార్ ఎస్‌యూవీ ఎంజి హెక్టర్, హెక్టర్ ప్లస్, జీప్ కంపాస్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Image Courtesy: Gurugram News

Most Read Articles

English summary
Brand New Tata Harrier Stolen From Showroom. Read in Telugu.
Story first published: Tuesday, June 22, 2021, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X