కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

భారతదేశంలో అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురుపడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మనం రోడ్లపై కార్ల యొక్క వెనుక భాగంలో ఆహారపదార్థాలు, బట్టలు మరియు అలంకార సామాగ్రికి సంబంధించిన చాలా వస్తువులు అమ్మడం చూడవచ్చు.

కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

కార్లలోనే కాకుండా తోపుడు బండ్ల మీద లేదా ఆటో రిక్షా మీద వస్తువులను విక్రయిస్తూ ఉండటం కూడా చూడవచ్చు. కానీ ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి కూరగాయలను కారులో అమ్ముతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరు కూరగాయలు అమ్మడానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్ కారును ఉపయోగిస్తున్నారు.

కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

కొత్త టయోటా ఫార్చ్యూనర్ కారులో కూరగాయలను అమ్మే వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో లేటెస్ట్ వెర్షన్ ఫార్చ్యూనర్ కారులో కూరగాయలు అమ్మడం చూడవచ్చు. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.

MOST READ:ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

కానీ ఇక్కడ మనం వీడియోలో గమనించినట్లయితే వారు మరాఠీ మాట్లాడుతున్నారు. కావున ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగి ఉంటుందని నిర్దారించవచ్చు. లేటేస్ట్ వెర్షన్ టయోటా ఫార్చ్యూనర్ కారు బూట్‌లో కూరగాయలను అమ్మే వ్యక్తిని మీరు వీడియోలో చూడవచ్చు.

కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

కూరగాయలు కొనడానికి వచ్చిన వ్యక్తులను కూడా ఈ వీడియోలో గమనించవచ్చు. కూరగాయల బరువును తూచడానికి ఫార్చ్యూనర్ కారు బూట్ మీద డిజిటల్ స్కేల్ కూడా అమర్చబడి ఉంది. ఈ టయోటా ఫార్చ్యూనర్ కారు యజమాని గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

MOST READ:కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

ఈ కారు యజమాని కూరగాయల విక్రేతకు కారును ఇచ్చే అవకాశం ఉంది. కూరగాయలు, పండ్లు భారతీయ రోడ్లపై తాత్కాలిక దుకాణాలుగా ఏర్పాటు చేసుకుని అమ్మడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొత్త తరం వెర్షన్ అయిన టయోటా ఫార్చ్యూనర్ కారును కూరగాయలు విక్రయించడానికి ఉపయోగించడం.

కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

వాహనాలలో కూరగాయలు మొదలైన వాటిని విక్రయించేవారు ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇక్కడ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి కూరగాయలు అమ్మే వ్యక్తితో మాట్లాడి కారు ఎవరికి చెందినది అని అడుగుతాడు. కానీ విక్రేత దాని గురించి పెద్ద సమాచారం ఇవ్వలేదు. కూరగాయలను విక్రయించే వ్యక్తి రైతు కావచ్చు. రైతులకు ఇలాంటి వాహనాలు ఉండటం పెద్ద విషయం కాదు.

MOST READ:మహీంద్రా కస్టమర్లకు గుడ్ న్యూస్.. వెహికల్ వారంటీ టైమ్ ఇప్పుడు జులై 31 వరకు

కానీ వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తికి ఈ టయోటా ఫార్చ్యూనర్ డాక్టర్‌కు చెందినదని గుర్తించాడు. అయితే ఒకవేలా డాక్టర్ ఈ వ్యక్తికి కారును విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వ్యక్తి టయోటా ఫార్చ్యూనర్ కారును ఉపయోగించి కూరగాయలను ఎందుకు విక్రయించాడో తెలియదు. వ్యవసాయం నుండి లక్షల రూపాయలు సంపాదించే మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఉండటం గమనార్హం.

కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వాళ్ళ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆటోలో ఇతర వాహనాలను ఉపయోగించి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కాలం గడుపుతుంటారు. ఇది ఒకరకంగా మంచి జీవనోపాధిగా కూడా ఉంటుంది.

MOST READ:కరోనా సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్స్ మూసివేత

Most Read Articles

English summary
New Toyota Fortuner Used For Vegetables Selling. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X