బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

బాలీవుడ్ చిత్ర సీమలోని ఎంతోమంది సెలబ్రెటీలు వాడే లగ్జరీ కార్లను గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ అయిన విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ ఉపయోగించే కార్లను గురించి తెలుసుకుందాం.

విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, అయితే వారు ఇద్దరూ ఎలాంటి విలాసవంతమైన కార్లను ఉపయోగించారు అనే విషయాలను మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం, రండి.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

విక్కీ కౌశల్ కార్ కలెక్షన్:

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ కి సాధారణంగానే కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇతడు ఆధునిక కార్లను కలిగి ఉన్నారు. విక్కీ కౌశల్ కార్ల విషయానికి వస్తే..

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB:

విక్కీ కౌశల్ లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB ఒకటి. ఇది అతని కార్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన కారు. ఈ కారును ఇతడు ఈ ఏడాది ప్రారంభంలోనే కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ కారుని ఎక్కువమంది సెలబ్రెటీలు ఇష్టపడతారు. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. విక్కీ కౌశల్ కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ. రూ. 2.7 కోట్లు, ఎక్స్-షోరూమ్.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

మెర్సిడెస్-బెంజ్:

విక్కీ కౌశల్ కొన్ని సంవత్సరాల ముందు జర్మన్ బ్రాండ్ అయిన మెర్సిడెస్-బెంజ్ యొక్క జిఎల్ఈ కొనుగోలు చేసాడు. కౌశల్ గ్యారేజ్ లో ఉన్న ఏకైక తెల్ల రంగు కారు ఈ మెర్సిడెస్-బెంజ్ GLE. ఇప్పటికి చాలా సార్లు అతడు ఒంటరిగా రేంజ్ రోవర్ మరియు మెర్సిడెస్-బెంజ్ GLE డ్రైవ్ చేస్తూ కనిపించాడు.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

సాధారణంగా విక్కీ కౌశల్ కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే అప్పుడప్పుడు ఒంటరిగా కార్లను డ్రైవ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. జర్మన్ వాహన తయారీ సంస్థ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో బెంజ్ జిఎల్ఈ ఒకటి. ఇది చాలామంది సెలబ్రెటీలు ఉపయోగిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

బిఎండబ్ల్యు 5జిటి:

విక్కీ కౌశల్ కలిగి ఉన్న లగ్జరీ కార్లలో ఒకటి బిఎండబ్ల్యు 5జిటి. ఇది కంపెనీ యొక్క 5-సిరీస్ GT వేరియంట్. ఇది కంపెనీ యొక్క అధునాతన కారు. అయితే కౌశల్ ఎక్కువగా ఈ కారులో కనిపించలేదు. కానీ ఈ లగ్జరీ కారుని కూడా యితడు కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

విక్కీ కౌశల్ చాలా తక్కువగా ఈ కారుని ఉపయోగిస్తారని తెలిసింది. అతడు జిమ్‌కు చేరుకోవడానికి మరియు నగరం చుట్టూ తిరగడానికి దీనిని వినియోస్తారు. BMW 5GT చాలా దూకుడు రూపాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది చాలా విశాలమైన క్యాబిన్ కలిగి ఉంటుంది. BMW 5GT ధర దాదాపు రూ. 1 కోటి వరకు ఉంటుంది.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

కత్రినా కైఫ్ కార్ కలెక్షన్:

బాలీవుడ్ సినీ రంగంలో లగ్జరీ కార్లను ఎక్కువుగా ఇష్టపడే వారిలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె తెలుగు మరియు హిందీ మొదలైన భాషల్లోని సినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యింది. కత్రినా కైఫ్ కలిగి ఉన్న లగ్జరీ కార్ల విషయానికి వస్తే,

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

ఆడి క్యూ7:

కత్రినా కైఫ్‌కి భారతదేశంలో మొదటి లగ్జరీ కారు ఆడి క్యూ7, ఈమె చాలా సంవత్సరాలు ఈ కారుని ఉపయోగించినట్లు తెలిసింది. ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కత్రినా కైఫ్ కలిగి ఉన్న ఆడి క్యూ7 కారు బ్లాక్ కలర్ లో ఉంటుంది.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

క్యూ7 అనేది జర్మన్ కంపెనీ అయిన ఆడి యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇది దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. కత్రినా కైఫ్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ ఉపయోగించడం ప్రారంభించే వరకు కూడా ఆడి క్యూ7 కారునే ఉపయోగించింది.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్:

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ చాలామంది సెలబ్రెటీల ఇష్టమైన కారు. ఈ కారణంగానే చాలామంది ఈ కారుని కలిగి ఉన్నారు. ఈ జాబితాలో కత్రినా కైఫ్ కూడా ఉంది. కత్రినా కైఫ్ రేంజ్ రోవర్‌ కారుని కలిగి ఉంది. అయితే, నివేదికల ప్రకారం ఈ కారుని సల్మాన్ ఖాన్ అందించినట్లు తెలిసింది.

బాలీవుడ్ స్టార్ కపుల్స్ 'విక్కీ-కత్రినా' లగ్జరీ కార్స్.. చూసారా..!!

ప్రస్తుతం కత్రినా కైఫ్ ఎక్కువగా ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారుని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఇది ఆమెకు ఎంతో ఇష్టమైన కారు అని కూడా తెలిసింది. ఈ కారు కూడా చాలా అరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున వినియోగించడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Newly wed couple katrina kaif and vicky kaushal car collection details
Story first published: Saturday, December 11, 2021, 10:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X