బ్రెజిల్ ఆశాకిరణం నెమార్ వెహికల్ కలెక్షన్

By Ravi

2014 ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. నేడు రెండు దక్షిణమెరికా టీమ్‌లు (బ్రెజిల్‌, కొలంబియా జట్లు) క్వార్టర్స్‌ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ బ్రెజిల్‌ తమ సొంతగడ్డపై చెలరేగిపోతుందని ఆశిస్తే, క్వార్టర్స్‌‌రు చేరుకోవడానికి ఆపసోపాలు పడింది. మరోవైపు మొదటిసారి క్వార్టర్స్‌కు చేరిన కొలంబియా వరుస విజయాలతో మంచి జోరు మీదుంది.

బ్రెజిల్ జట్టులో అత్యంత కీలకమై ఆటగాడు నెమార్‌, ఇప్పటి వరకూ జట్టును ముందుండి నడిపించిన నెమార్ గాయం నుంచి పూర్తిగా కోలుకోన్నప్పటికీ కొలంబియాతో జరిగే మ్యాచ్‌లో అందుబాటులో ఉంటానని ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చాడు. అయితే, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. సరే అదటుంచితే, నెమార్‌కు ఫుట్‌బాల్‌తో విలాసవంతమైన వాహనాలంటే కూడా మక్కువ ఎక్కువే.

నెమార్ వద్ద పలు విలాసవంతమైన కార్లు, ఓ ప్రత్యేక హెలికాఫ్టర్ మరియు ఓ లగ్జరీ యాచ్ కూడా ఉన్నాయి. ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో బ్రెజిల్ జట్టు ఆశాకిరణం నెమార్ వెహికల్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

నెమార్ వెహికల్ కలెక్షన్

నెమార్ ప్రస్తుత 2014 బ్రెజిల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు ఫిబ్రవరి 5, 1992లో బ్రెజిల్‌లోని మోగి దాస్ క్రూజెస్‌లో జన్మించాడు. నెమార్‌కు ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో కార్లంటే కూడా అంతే ఇష్టం. తర్వాతి స్లైడ్‌లలో అతని కార్ కలెక్షన్‌ను చూడండి.

ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ వి8 టిఎఫ్ఎస్ఐ

ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ వి8 టిఎఫ్ఎస్ఐ

నెమార్ వద్ద ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ వి8 టిఎఫ్ఎస్ఐ మోడల్ ఉంది. జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ఇది. దాదాపు 2002 సంవత్సరం నుంచి ఫోక్స్‌వ్యాగన్ ఈ మోడల్‌ను ఉత్పత్తి చేస్తోంది. టీం ప్రాక్టీస్ కోసం వెళ్లేటప్పుడు నెమార్ ఎక్కువగా ఈ వాహనాన్నే ఉపయోగిస్తుంటాడు.

ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్

ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్

ప్రాక్టీస్ లేని సమయంలో నెమార్ తన ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ ఎస్‌యూవీలో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఆఫ్‌రోడింగ్ చేస్తుంటాడు. ఆఫ్‌రోడింగ్ చేయని వాళ్లు ఎస్‌యూవీ కొనడంలో అర్థం లేదు. టోరెగ్ పెర్ఫార్మెన్స్ నెమార్‌ను ప్రతిభింభింపజేస్తుంది.

ఆడి ఆర్8 జిటి

ఆడి ఆర్8 జిటి

నెమార్ వద్ద ఆడి స్పోర్ట్స్ కార్ ఆర్8 జిటి మోడల్ కూడా ఉంది. ఈ బ్రెజిలియన్ స్టార్ తన ఆడి ఆర్8 జిటి స్పోర్ట్స్ కారును ప్రతిరోజు డ్రైవ్ చేయనప్పటికీ, స్నేహితులతో పార్టీకి వెళ్లేటప్పుడు ఇదే అతని ఫస్ట్ చాయిస్.

ఆడి ఆర్8 జిటి

ఆడి ఆర్8 జిటి

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న ఆడి ఆర్8 జిటి ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్. ఇప్పటి వరకు కేవలం 333 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. ఇందులో ఉపయోగించిన 5.2 లీటర్ ఎఫ్ఎస్ఐ క్వాట్రో ఇంజన్ గరిష్టంగా 552 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

పోర్షే పనామెరా

పోర్షే పనామెరా

నెమార్ వద్ద పోర్షే బ్రాండ్ కారు కూడా ఉంది. పోర్షే అందిస్తున్న పాపులర్ పనామెరా మోడల్‌ను అతను ఎక్కువగా లాంగ్ ట్రిప్స్ కోసం ఉపయోగిస్తుంటాడు. జర్మన్ కంపెనీ పోర్షే ఈ మోడల్‌ను 2009 నుంచి ఉత్పత్తి చేస్తోంది. ఇది పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

హెలికాఫ్టర్

హెలికాఫ్టర్

బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్ వద్ద ఓ పర్సనల్ హెలికాఫ్టర్ కూడా ఉంది. తాను ఎప్పుడైనా వేగంగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తూ ఉంటాడు.

లగ్జరీ యాచ్

లగ్జరీ యాచ్

నెమార్ వద్ద హెలికాఫ్టర్ మాత్రమే కాదు, ఓ లగ్జరీ యాచ్ కూడా ఉంది. ఎప్పుడైనా విరామం దొరికినప్పుడు సరదాగా గడిపేందుకు నెమార్ ఈ యాచ్‌‌ను ఉపయోగిస్తుంటాడు.

నెమార్ వెహికల్ కలెక్షన్

ఇది కూడా చదవండి: టాప్ 10 ఫుట్బాల్ ప్లేయర్స్ అండ్ కార్స్

More from DriveSpark

Article Published On: Friday, July 4, 2014, 16:44 [IST]
English summary
Neymar Jr is passionate about his Football, however, he is also passionate about the motor vehicles that he possesses. He has a long list of vehicles, we will today show you a few of his most cherished vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+