Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ; ఎంతో తెలుసా ?
మన దేశంలో 2021 జనవరి 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు అన్ని వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి డిసెంబర్ 24 న ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా మొత్తం రూ. 80 కోట్ల టోల్ గేట్ ఫీజు వసూలు చేశారు.

భారతదేశంలో ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం ఇదే మొదటిసారి. ఇది నిజంగా గొప్ప విజయంగా పరిగణిస్తున్నారు. 50 మిలియన్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల ద్వారా ఈ రికార్డు సృష్టించబడింది. నేషనల్ హైవే అథారిటీ దీనికి సంబంధించని సమాచారాన్ని డిసెంబర్ 25 న ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది.

చాల రోజుల నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అంటున్న కారణంగా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడంతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బును సేకరించడం నిజంగా ఒక మైలురాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకారం అన్ని వాహనాలకు జనవరి 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ వాడకం తప్పనిసరి. వాహనదారులు దీనిని గమనించాలి.
MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

జనవరి 1 నుంచి అన్ని వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించేలా, దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఇటీవల కాలంలో ఫాస్ట్‌ట్యాగ్‌ను స్వీకరించడం వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడం వల్ల వాహనదారులు ఎక్కువసేపు టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఫాస్ట్‌ట్యాగ్ అనేది కేవలం వాహనదారుల సమయాన్ని అదా చేయడం మాత్రమే కాకుండా, ఇంధనాన్ని కూడా చాల వరకు ఆదా చేస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగించడం వల్ల వాహనదారునికి ఈ రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. కొన్నిసార్లు మీరు టోల్ ఫీజు చెల్లించడానికి టోల్ గేట్లో చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది.

ప్రతి వాహనం టోల్ గేట్ లో ఎక్కువ సమయం వేచి ఉండటం వల్ల ఎక్కువ సమయం అక్కడ వేచి ఉండాల్సి వస్తుంది. కావున టోల్ గెట్ లో ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు వాహనాలు కి.మీ దూరం ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ సమస్యలను ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా పరిష్కరించవచ్చు.

వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఏర్పాటు చేసినట్లయితే టోల్ గేట్లలో ఏర్పాటు చేసిన స్కానర్లు వాహనం ముందు భాగంలో అతికించిన ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌లను స్కాన్ చేస్తాయి. ఇది టోల్ ఫీజును ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ నుండి ఆటోమాటిక్ గా తీసుకుంటుంది.
MOST READ:మళ్ళీ ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీస్.. ఎప్పటినుండో తెలుసా ?

అవసరమైనప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌లను రీఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్‌లు జాతీయ రహదారుల టోల్‌ల వద్ద వాహనాలను నిరంతరాయంగా ముందుకు సాగడానికి అనుమతిస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్స్ కాగితం వాడకాన్ని తగ్గిస్తుంది. కరోనా మహమ్మరి సమయంలో ఈ అంటు వ్యాధిని తగ్గించడానికి సామాజిక అంతరాన్ని తగ్గించడానికి ఫాస్ట్‌ట్యాగ్‌లు సహాయపడతాయి.
MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

టోల్ ఫీజు చెల్లించడానికి టోల్ ప్లాజా సిబ్బందిని సంప్రదించనవసరం లేనందున ఫాస్ట్‌ట్యాగ్‌లను ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగించడానికి ముందుకు వస్తారు. ఫాస్ట్‌ట్యాగ్‌ను స్వీకరించడం టోల్‌ల రిటైల్ సమస్యను కూడా పరిష్కరిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ వాడకం తప్పని సరి కావున, జనవరి 1 ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రతి వాహనదారుడు వెంటనే ఫాస్ట్‌ట్యాగ్‌ను స్వీకరించడం మంచిది.