టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

జాతీయ రహదారులలో ఉన్న టోల్ గేట్ల వద్ద వాహనాలు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్ట్‌ట్యాగ్ అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫాస్ట్‌ట్యాగ్ అమలులోకి వచ్చినప్పటినుంచి టోల్ గేట్ల దగ్గర వాహనాలు వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గిపోయింది.

టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ఇప్పటికి కూడా కొన్ని టోల్ గేట్ల వద్ద కొన్ని అనివార్య కారణాల వల్ల వాహనదారులు చాలా సేపు ఉండాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవే అథారిటీ వాహనదారులకు అనుకూలంగా ఒక కొత్త ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజా యొక్క రెండు సందులలో పసుపు గీతలు గీయాలని టోల్ బూత్ కాంట్రాక్టర్లకు నేషనల్ హైవే అథారిటీ సూచించింది.

టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ఈ పసుపు రంగు లైన్లకు వెలుపల నిలిపిన వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేయకూడదని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. టోల్ ప్లాజా నుండి 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయడానికి నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలను జారీ చేసింది.

MOST READ:2021 హయాబుసా డీలర్‌షిప్‌కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే

టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

నేషనల్ హైవే అథారిటీ ప్రకారం, 100 మీటర్ల వెలుపల వేచి ఉన్న వాహనాలు టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్ళవచ్చు. అయితే 100 మీటర్ల లోపు వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాహనానికి టోల్ ఫీజు చెల్లించడానికి కేవలం 10 సెకన్ల సమయం తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ సలహా ఇస్తుంది.

టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ఈ సమయం వాహనాన్ని ఎక్కువసేపు వేచి ఉండకుండా వాహనం త్వరగా ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజు చెల్లింపు కోసం ఉపయోగించబడుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి ఫాస్ట్‌ట్యాగ్ వాడకం తప్పనిసరి చేయబడింది.

MOST READ:ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి

టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

దేశవ్యాప్తంగా దాదాపు 96% వాహనాలు ఫాస్ట్‌ట్యాగ్ లోనే టోల్ ఫీజులు చెల్లిస్తున్నాయి. దేశంలోని కొన్ని టోల్ ప్లాజాలు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా 99% ఫీజు చెల్లిస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో భారతదేశాన్ని టోల్ ఫ్రీ దేశంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలను తొలగించి వాటి స్థానంలో ఆటోమేటిక్ ఛార్జింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరికరాలను వ్యవస్థాపించిన తర్వాత వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డిజిటల్ లావాదేవీ ద్వారా వాహనం కదులుతున్నప్పుడు టోల్ ఫీజు తీసుకోబడుదుతుంది.

MOST READ:లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

రాబోయే కొన్నేళ్లలో ఈ తరహా పరికరాలు దేశంలో అందుబాటులో ఉంటాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. అంతే కాకుండా ఇటీవల టోల్ ప్లాజా గుండా వెళుతున్న ఆక్సిజన్ ట్యాంకర్లకు టోల్ వసూలు చేయకూడదని కూడా తెలిపింది. కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించడానికి వెళ్తున్న వాహనాలకు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఫీజు వసూలు చేయబడదు.

Most Read Articles

English summary
NHAI Asks Toll Operators To Draw 100 Meters Yellow Lines From The Toll Gate. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X