ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చాలా అధికంగా ఉంది. ఈ మహమ్మరి వల్ల ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. లెక్కకుమించిన ప్రజలు రోజూ ఈ వైరస్ భారిన పడుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో కరోనా వల్ల చనిపోవడానికి ప్రధాన కారణం ఆక్సిజన్ కొరత.

ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

దేశంలో ఆక్సిజన్ కొరతని తీర్చడానికి ప్రభుత్వాలు మరియు సామాజిక సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా సోకిన వారు లక్షల్లో ఉంటారని అంచనా, కావున వీరందరికి ఆక్సిజన్ సరఫరా చేయడం అనేది చిన్న విషయమైతే కాదు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని.

ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ఆక్సిజన్ కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపిన అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తమ తయారీ కర్మాగారాల్లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆటో మొబైల్ కంపెనీలు ఉత్పత్తులను నిలిపివేసి ఆక్సిజన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి.

MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?

ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ప్రజలు ఆక్సిజన్ కొరత వల్ల చనిపోకుండా ఉండటానికి ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు తమ వంతు కృషి చేస్తున్న సమయంలో సాయంగా నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ట్యాంకర్లకు టోల్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియ ప్రకారం ఇప్పుడు ఆక్సిజన్ రవాణా చేసే వాహనాలు టోల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆక్సిజన్ రవాణా చేయడంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సమయానికి ఆక్సిజన్‌ను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు

ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ప్రస్తుతం ఆక్సిజన్ దృష్టిలో ఉంచుకుని, ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లను, ప్రాణాలను రక్షించే అంబులెన్స్‌లతో పోల్చడం ద్వారా ఈ విధమైన మినహాయింపు ప్రకటించారు. అందువల్లనే ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు ఏ జాతీయ రహదారులపై టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

రాబోయే రెండు నెలలు లేదా నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ మినహాయింపు అమలులో ఉంటుంది. అత్యవసర సమయంలో నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా నిర్ణయం ప్రశంసనీయం.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

మెడికల్ ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్ డ్రైవర్లు కూడా ప్రస్తుతం ప్రశంసించబడుతున్నారు. కరోనా వైరస్ యొక్క ఫస్ట్ వేవ్ లో వెంటిలేటర్లకు డిమాండ్ ఉండేది. అయితే ప్రస్తుతం ఆక్సిజన్ కి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. కావున ఆక్సిజన్ త్వరితగతిన అందించడానికి ఆక్సిజన్ ట్యాంకర్లు గమ్యాన్ని చేరుకోవాలి కావున నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

Most Read Articles

English summary
NHAI Gives Toll Fee Exemption For Tankers Carrying Medical Oxygen. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X