మన దేశంలో ఇవే ఉత్తమమైన జాతీయ రహదారులని మీకు తెలుసా?
మన దేశంలో ఉన్న పది ఉత్తమమైన జాతీయ రహదారుల గురించి మీకు తెలుసా? ఇటీవల భారత జాతీయ రహదారుల సంస్థ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా - ఎన్‌హెచ్‌ఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల గురించి ఓ సర్వే నిర్వహించింది.

ఎన్హెచ్ఏఐ ఈ సర్వేలో కొన్ని ఉత్తమ రహదారులను గుర్తించింది. తాజాగా, అందుకు సంబంధించిన వివరాలను కూడా విడుదల చేసింది. ఈ సర్వే భారతదేశ వ్యాప్తంగా 219 జాతీయ రహదారులను 18,668 కి.మీ మేర కవర్ చేసింది.

ఈ అధ్యయనంలో జాతీయ రహదారుల ర్యాంకింగ్‌ను వాటి నాణ్యత, భద్రత మరియు వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత మాత్రమే నిర్ణయించబడుతుంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇటువంటి అధ్యయనాలు ఇకపై ప్రతి ఆరునెలలకు ఒకసారి చొప్పున నిర్వహించబడతాయి.

ఈ అధ్యయనాల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు మరియు వాటిని నిర్వహించేందుకు సహాయపడతాయని సదరు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ సర్వేలు జాతీయ రహదారుల యొక్క ప్రస్తుత స్తితిని మరియు సేవలను అంచనా వేస్తుందని ఎన్‌హెచ్ఏఐ తన నివేదికలో పేర్కొంది.

ఎన్హెచ్ఏఐ చేసిన ఈ సర్వే ఫలితాల ఆధారంగా జాతీయ రహదారి నిర్మాణ పనుల నాణ్యత, ప్రమాణాలకు కట్టుబడి ఉండటం మరియు నిర్మాణంలో అనుసరించిన మార్గదర్శకాలు వంటి పలు అంశాలను పరీశిలించేందుకు ఇది సహకరిస్తుంది. అలాగే, హైవేలో ఏదైనా లోపం లేదా సమస్యను గుర్తించినట్లయితే, వెంటనే పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.

ఎన్హెచ్ఏఐ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ అధ్యయనంలో అహ్మదాబాద్ మరియు వడోదర మధ్య 102 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఎన్‌హెచ్-48 దాని నాణ్యత మరియు సౌకర్యాల పరంగా దేశంలోనే ఉత్తమమైన జాతీయ రహదారిగా మొదటి స్థానంలో ఉంది.

ఆ తర్వాతి (2వ) స్థానంలో గోవా మరియు కర్ణాటక మధ్య 141 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఎన్‌హెచ్-66 ఉంది. ఇది దేశంలో రెండవ ఉత్తమ జాతీయ రహదారిగా ప్రకటించబడింది. ఇదే సమయంలో, అహ్మదాబాద్ మరియు వడోదరలను కలిపే 93 కిలోమీటర్ల ఎన్ఈ-1 ఫోర్ లేన్ జాతీయ రహదారి ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ మూడు ఉత్తమ జాతీయ రహదారులను ఐఆర్‌బి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లు నిర్మించారు.

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది సిమ్గా మరియు సర్గాన్ మధ్య 42 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఎన్‌హెచ్-130. ఈ రహదారిని లార్సెన్ అండ్ టౌబ్రో సంస్థ అభివృద్ధి చేసింది. ఇక ఇందులో ఐదవ స్థానంలో సోలాపూర్ మరియు యడేషి మధ్యలో 98 కిలోమీటర్ల మేర ఉన్న ఎన్‌హెచ్-211.

కృష్ణగిరి మరియు వల్జాపేట మధ్యలో 148 కిలోమీటర్ల పొడవైన ఎన్‌హెచ్-48 స్ట్రెచ్ భారతదేశంలో ఆరవ ఉత్తమ జాతీయ రహదారిగా నిలిచింది. గోద్రా మరియు గుజరాత్/మధ్యప్రదేశ్ సరిహద్దులను కలిపే 87.1 కిలోమీటర్ల పొడవు గల ఎన్‌హెచ్-47 ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది.

భారతదేశంలోని టాప్-10 ఉత్తమ జాతీయ రహదారుల జాబితాలో చివరి మూడు స్థానాల్లో బెంగళూరు నుండి నెలమంగళ మధ్యలో ఉన్న ఎన్‌హెచ్-4, ఇస్లాం నగర్ మరియు కదతల్ మధ్యలో ఉన్న ఎన్‌హెచ్-44 అలాగే, మహూలియా నుండి బహ్రగోడ మరియు బహ్రగోడ నుండి చిచిరాలను కలిపే ఎన్‌హెచ్-33 జాతీయ రహదారులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications