ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భాగంగానే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక షాకింగ్ ప్రకటించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

జాతీయ రహదారుల టోల్ ఫీజును ఏప్రిల్ 1 నుండి పెంచనున్నట్లు సంబంధిత నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ఫీజును ఇప్పుడు దాదాపు 5% పెంచినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై టాక్స్ భారీగా పెంచింది.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

దీనివల్ల మిగిలిన వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు పేద, మధ్యతరగతి ప్రజల పాలిట తీవ్ర పరిణామాలను చూపిస్తాయి. ఇప్పుడు జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల పై టోల్ ఫీజులు మరింత పెంచుతూ NHAI ఒత్తిడి తెస్తోంది.

MOST READ:కొత్త కలర్‌లో దర్శనమిచ్చిన బజాజ్ పల్సర్ 150 బైక్ : వివరాలు

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

నేషనల్ హైవే అథారిటీ ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జాతీయ రహదారుల టోల్ ఫీజును పెంచుతుంది. దీని ప్రకారం, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి టోల్ ఛార్జీలు పెరుగుతాయి. ఈసారి టోల్ ఛార్జీలు రూ. 5 నుంచి రూ. 30 కి పెరిగే అవకాశం ఉంది. టోల్ ఫీజు చెల్లింపు విధానాన్ని సరళీకృతం చేయడానికి బైక్‌లు మినహా అన్ని వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం ఇప్పటికే అమలులో ఉంది.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ ప్లాజా గుండా వెళ్లే వాహనాలకు డబుల్ టోల్ వసూలు చేయబడుతుంది. ఈ నేపథ్యంలో, వాహన యజమానులందరూ తమ వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా స్వీకరించారు.

MOST READ:ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థ అందుబాటులోకి వచినప్పటి నుంచి ప్రతి రోజు టోల్ ప్లాజాల్లో ఫాస్ట్‌టాగ్ వసూలు చాలా వరకు పెరుగుతోంది. ఇప్పుడు టోల్ ఫీజు పెరుగుతుందనే వార్త వాహనదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫాస్ట్‌ట్యాగ్‌లు టోల్ ప్లాజాల్లో గంటసేపు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తాయి.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

ఫాస్ట్‌ట్యాగ్‌లు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. టోల్ గేట్ లో వేచి ఉంటె సమయం చాలా తగ్గుతుంది, తద్వారా వాహనదారులు ఇంధనాన్ని ఆదా చేయగలరని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇటీవల ఇంధన కొరత గణాంకాలను కూడా విడుదల కూడా విడుదలయ్యాయి.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్‌లు వచ్చిన తర్వాత జాతీయ రహదారులపై ప్రతిరోజూ రూ. 104 కోట్లు వసూలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 16 నుండి వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్ వాడకం తప్పనిసరి. ఏది ఏమైనా పెరుగుతున్న ధరలు సామాన్యుడికి తలకు మించిన భారమైపోతోంది.

Source: HT Auto

Most Read Articles

English summary
NHAI To Increase Toll Price By 5 Percent From April 1st. Read in Telugu.
Story first published: Tuesday, March 16, 2021, 10:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X