జూన్ 2 నుంచే టోల్ చార్జీల బాదుడు.. ఎంత పెరుగుతుందో ఇప్పుడే తెలుసుకోండి
ప్రతి ఏటా ఏప్రిల్ 2న టోల్ చార్జీల పెంపు ఉంటుంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నిలక నగారా మోగడంతో.. టోల్ చార్జీల పెంపు వాయిదా పడింది. జూన్ 1నాటికి ఎన్నికలు ముగుస్తాయి. జూన్ 2నుంచే కొత్త టోల్ ఫీజులు అమలులోకి వస్తాయి.
జూన్ 1న చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచియే కొత్త టోల్ చార్జీలు అమలులోకి వస్తాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తెలిపింది. ఎన్‌హెచ్‌ఏఐ ఈ దిశగానే అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడవుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా టోల్ ఫీజు 5 శాతం పెరుగుతుందని సమాచారం.

మనదేశంలోని జాతీయ రహదారుల మీద ప్రస్తుతం సుమారు 855 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలు ఉన్నట్లు సమాచారం. ఈ కొత్త టోల్ ఫీజులు దేశవ్యాప్తంగా ఒకేసారి అమలులోకి వస్తాయి. ఎన్నికల కారణంగా టోల్ ఫీజుల పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను భారత ఎన్నికల సంఘం ఆదేశించింది ఈ కారణంగానే ఎన్‌హెచ్‌ఏఐ ఇన్ని రోజులు టోల్ ఫీజుల పెంపును వాయిదా వేసింది. ఇక త్వరలోనే కొత్త టోల్ ఫీజులు అందుబాటులోకి వస్తాయి.
ఈ ఏడాది టోల్ ఫీజులు పెరిగిన తరువాత.. అన్ని రాకలా వాహనాల టోల్ ధరలు రూ.10 నుంచి రూ.60 వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే.. కార్ల టోల్ ఫీజు రూ.5 నుంచి రూ.10కి, బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25కు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇక భారీ వాహనాల విషయానికి వస్తే.. వాటి టోల్ ఫీజులు ఏకంగా రూ.40 నుంచి రూ.50కి పెరిగే అవకాశం ఉంది.

పైన వెల్లడించిన ధరలు కేవలం అంచనా మాత్రమే.. కానీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పెరిగిన కొత్త ధరలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ సమయంలో ఏ వాహనం మీద ఎంత టోల్ ఫీజు పెరిగిందనేది స్పష్టమవుతుంది. అమలులోకి రానున్న కొత్త ధరలు వాహన వినియోదారుల మీద ప్రభావం చూపుతాయని కొందరు చెబుతున్నారు. కానీ పెరుగుదల మాత్రం ప్రతి ఏటా మాదిరిగానే ఉంటుంది.
టోల్ చార్జీలు మాత్రమే కాకుండా సింగిల్, డబుల్ ట్రిప్పులతో పాటు నెలవారీ పాసుల ధరలు కూడా పెరుగుతాయని సమాచారం. వీటి ధరలు ఎంత వరకు పెరుగుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది. టోల్ ఫీజుల పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఆదాయం భారీగా పెరుగుతుంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం రోడ్ల విస్తరణను కూడా వేగంగా జరుగుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని టోల్ ప్లాజాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.

టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి కేంద్రం ఫాస్టాగ్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. ఫాస్టాగ్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత టోల్ గేట్ల వద్ద వేచి ఉండాల్సిన సమయం మాత్రమే కాకుండా టోల్ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో టోల్ గేట్లనేవే లేకుండా శాటిలైట్ టోల్ కలెక్షన్ సిస్టం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని గురించి గడ్కరీ కూడా ప్రస్తావించారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








