ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

మన దేశంలో భారతీయ రైల్వేస్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలకు మాత్రమే పరిమితమైన బుల్లెట్ ట్రైన్ సేవలు ఇప్పుడు మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. హై-స్పీడ్ రైలు సేవల కోసం తాజాగా మరొక కొత్త ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది.

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

ముంబై-నాగ్‌పూర్ మధ్యలో హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం అధికారులు గ్రౌండ్ సర్వేను ప్రారంభించారు. ఈ సర్వే ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుంది. ఈ ప్రతిపాదిత ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ యొక్క వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ను రూపొందించేందుకు గాను గ్రౌండ్ సర్వే నిర్వహించడానికి, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సర్వే (లిడార్)ను శుక్రవారం ప్రారంభించారు.

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

మార్చి 12వ తేదీన నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ముంబై-నాగ్‌పూర్ స్ట్రెచ్‌లో మొత్తం 736 కిలోమీటర్ల పొడవైన రైలు కారిడార్ కోసం గ్రౌండ్ సర్వేకు సంబంధించిన డేటాను సంగ్రహించడం కోసం ఏరియల్ లిడార్ మరియు ఇమేజరీ సెన్సార్‌లతో అమర్చిన విమానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

MOST READ:భారత్‌లో హోండా CB500X అడ్వెంచర్ టూరర్ లాంచ్ ; ధర & వివరాలు

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

ఈ విమానం ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ మార్గంలో ప్రయాణించి, అందులో అమర్చిన వివిధ సెన్సార్ల సాయంతో సమగ్రమైన డేటాని అందించనుంది. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను స్వీకరించిన నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సర్వే (లిడార్) టెక్నాలజీ సాయంతో కేవలం మూడు-నాలుగు నెలల్లో అన్ని గ్రౌండ్ వివరాలు మరియు డేటాను అందించనుంది. సాంప్రదాయ సర్వే పద్ధతుల ద్వారా ఈ డేటాను అందించాలంటే కనీసం 10-12 నెలల సమయం పడుతుంది.

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

సుమారు 736 కిలోమీటర్ల పొడవైన ఈ ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ ముంబై నగరాన్ని నాగ్‌పూర్, వార్ధా, ఖాప్రి డిపో, పుల్గావ్, మాలెగావ్ జహంగీర్, కరంజలాడ్, మెహకర్, ఔరంగాబాద్, జల్నా, షిర్డి, నాసిక్, షాహపూర్ మరియు ఇగత్పురి వంటి నగరాలతో కలుపుతుంది.

MOST READ:రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రైవసీ సూట్; ఇకపై ఆ కారులో అంతా రహస్యమే..!

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం, ఏదైనా సరళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు గ్రౌండ్ సర్వే ఒక కీలకమైన చర్య, ఎందుకంటే ఈ సర్వే చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాల యొక్క ఖచ్చితమైన వివరాలను తెలియజేస్తుంది. ఈ సర్వే డేటాను అందించడానికి ఎన్‌హెచ్ఎస్ఆర్‌సిఎల్ లేజర్ డేటా, జిపిఎస్ డేటా, ఫ్లైట్ పెరామీటర్స్ మరియు వాస్తవ ఛాయాచిత్రాల (ఫొటోగ్రాఫ్స్) కలయికను ఉపయోగిస్తుంది.

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

ఈ ఛాయాచిత్రాలను తీసేందుకు విమానంలో 100 మెగాపిక్సెళ్లతో కూడిన కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఏరియల్ లిడార్ సర్వే సమయంలో, సర్వే ప్రయోజనం కోసం ప్రతిపాదిత అమరిక చుట్టూ 150 మీటర్ల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఎన్‌హెచ్ఎస్ఆర్‌సిఎల్ తెలిపింది.

MOST READ:చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

ఈ తరహా వైమానిక లిడార్ సర్వే పద్ధతిని మొట్టమొదటిసారిగా ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడోసం కోసం అనుసరించారు. దేశంలో మొత్తం ఏడు ప్రతిపాదిత హై-స్పీడ్ రైల్ కారిడార్ల కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్టులను తయారుచేసే పనిని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్‌కు అప్పగించారు.

ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ రైల్ కారిడార్ కోసం డిజిటల్ సర్వే ప్రారంభం!

ముంబై-నాగ్‌పూర్ మార్గాన్ని అనుసరించి ఢిల్లీ-అమృత్సర్, వారణాసి-హౌరా, ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-హైదరాబాద్ మరియు చెన్నై-మైసూర్ మార్గాల్లో కూడా బుల్లెట్ రైళ్లను నడపడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అన్ని ప్రతిపాదిత హై-స్పీడ్ రైల్ కారిడార్లలో గ్రౌండ్ సర్వేలను నిర్వహించడానికి లిడార్ సర్వే టెక్నిక్‌నే ఉపయోగించనున్నారు.

MOST READ:పల్సర్ RS 200 బైక్ కొత్త వీడియో రిలీజ్ చేసిన బజాజ్

Most Read Articles

English summary
NHSRCL Starts LiDAR Digital Survey For Porposed Mumbai-Nagpur High-Speed Rail Corridor. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X