నేటి ఫేస్‌బుక్ వీడియో: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టెక్స్టింగ్ చేస్తే..?
ఈరోజు మన ఫేస్‌బుక్ వీడియోలో పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్ (పిఎస్ఏ)కు చెందిన ఓ సందేశాత్మక వీడియోని వీక్షిద్దాం రండి. ఈ వీడియోని ఇటీవలే యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్ఏ) నేషనల్ డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అవేర్‌నెస్ మంత్‌పై నిర్వహించిన అవగాహన ప్రచారంలో భాగంగా రూపొందించారు.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్ టెక్స్టింగ్ (మెసేజ్‌లు చదవటం, వాటికి సమాధానం ఇవ్వటం) చేయటం అనేది అత్యంత ప్రమాదకరమైదని మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చేయటం వలన రోడ్డుపై నుంచి మీ దృష్టి మరలి, డ్రైవింగ్ పట్ల ఏకాగ్రత కోల్పోయి పెను ప్రమాదం జరిగే అకాశం ఉంటుంది.

ఎన్‌హెచ్‌టిఎస్ఏ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ వీడియోని తయారు చేసింది. ఈ వీడియోలో ఓ యువతుల బృందం కారులో వెళ్తుండగా, డ్రైవింగ్ చేస్తున్న యువతి తన సెల్‌ఫోన్ టెక్స్టింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో, తాను రోడ్డుపై దృష్టిని మరల్చడంతో ఓ భారీ ట్రక్కు ఆ కారును ఢీకొట్టడం జరుగుతుంది.
ఇది నిజమైన యాక్సిడెంట్ కాదు. ఇదొక గ్రాఫిక్ వీడియో. సెల్ ఫోన్ డ్రైవింగ్ వలన కలిగే నష్టాల గురించి మోటారిస్టులలో అవగాహన కల్పించేందుకు ఈ వీడియోను రూపొందించారు. దీనికి ఓ స్లోగన్ కూడా ఉంది.. అదేంటంటే 'యూ డ్రైవ్, యూ టెక్స్ట్, యూ పే' (మీరే డ్రైవ్ చేయండి, మీరే టెక్స్టింగ్ చేయండి, మీరే మూల్యం చెల్లించుకోండి' అని దీని అర్థం. మరి ఆ వీడియోని చూసేద్దామా..!


Click it and Unblock the Notifications








