కారు నడుపుతూ సెల్ఫీ తీసుకున్నన రేసర్ నికో రోస్‌బర్గ్
కారు నడుపుతూ సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని చెబుతుంటే, కొందరు సెలబ్రిటీలు మాత్రం ఒకచేతితో కారును నడుపుతూ, మరో చేతితో సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో ఓ రేస్ డ్రైవర్ చేసిన ఇలాంటి ఫీట్‌ను చూద్దాం రండి..!
మెర్సిడెస్ ఏఎమ్‌జి జర్మన్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఓ పురాతన 1954 మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ196 రేస్ కారును డ్రైవ్ చేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. అయితే, ఈ ఫీట్‌ను పబ్లిక్ రోడ్లపై కాకుండా, ఎవ్వరూ లేని ఖాలీగా ఉండే రేస్‌ట్రాక్‌పై చేశాడు.
ప్రస్తుతం 'సెల్ఫీ' ట్రెండ్ విస్తృతంగా ఉన్న సంగతి తెలిసినదే. ఒకచేతితో మొబైల్ ఫోన్/కెమరా పట్టుకొని తమను తాము ఫోటో లేదా వీడియో తీసుకోవటాన్ని సెల్ఫీ అంటారు. మరొకరి సాయం అవసరం లేకుండా ఈ గ్యాడ్జెట్లలో తమ జ్ఞాపకాలను బంధించుకోవటమే సెల్ఫీ.
అయితే, నికో రోస్‌బర్గ్ చేసిన ఈ ఫీట్‌పై విమర్శకులు మాత్రం గుర్రమంటున్నారు. డ్రైవింగ్‌లో సెల్ఫీ చేయటం ప్రమాదకరమని, ఇలాంటి దానిని అసలు ప్రమోట్ చేయకూడదని వారు విమర్శిస్తున్నారు. అయితే, ఈ ఫీట్‌ను ఖాలీ రేస్ ట్రాక్‌పై చేయటంతో అంత ప్రమాదమేమీ లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, మీరు మాత్రం ఇలాంటి పిచ్చి పనిచేయకండి.


Click it and Unblock the Notifications








