Night Driving Tips: రాత్రి డ్రైవింగ్‌లో జరిగే ప్రమాదాలకి ఇదే కారణం.. ఈ 5 టిప్స్ మిస్ అయితే రిస్క్!
Night Driving Tips: రాత్రిపూట డ్రైవింగ్ అంటే చాలా మందికి భయం. కానీ నిజం ఏంటంటే... చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా తక్కువ విజిబిలిటీ, ఎదురుగా వచ్చే లైట్ల గ్లేర్, అంచనా తప్పడం.. ఇవి అన్నీ కలిసి రిస్క్‌ను పెంచేస్తాయి.
భారతదేశంలో రాత్రిపూట జరిగే రోడ్డు ప్రమాదాల్లో గణనీయమైన శాతం విజిబిలిటీ సమస్యల వల్లే జరుగుతున్నాయని రోడ్డు సేఫ్టీ నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సింపుల్ అలవాట్లు మార్చుకుంటే, రాత్రి డ్రైవింగ్‌ను పూర్తిగా సేఫ్‌గా మార్చుకోవచ్చు.

లైట్లు, అద్దాలు క్లీన్‌గా లేకపోతే... ప్రమాదమే!
చాలామంది లైట్ తీసుకునే విషయం ఇదే. కానీ హెడ్‌లైట్లు లేదా మిర్రర్స్ మీద దుమ్ము ఉంటే కాంతి సరిగా పడదు. దాంతో రోడ్ క్లియర్‌గా కనిపించదు.
డ్రైవ్‌కు బయలుదేరే ముందు 2 నిమిషాలు తీసుకుని లైట్లు, విండ్‌షీల్డ్ క్లీన్ చేస్తే మీ సేఫ్టీ లెవెల్ డబుల్ అవుతుంది.
ఎప్పుడూ హై బీమ్ వాడుతున్నారా? ఇది పెద్ద తప్పు
హై బీమ్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచడం చాలా ప్రమాదకరం. ఎదురుగా వచ్చే డ్రైవర్ కళ్లకు మిరుమిట్లు కొట్టేలా చేస్తుంది. అలా ఒక్క క్షణం విజన్ బ్లర్ అయితే... ప్రమాదం జరిగే అవకాశమే ఎక్కువ. ఖాళీ రోడ్లలో మాత్రమే హై బీమ్, మిగతా టైమ్ లో బీమ్ వాడటం బెస్ట్.

కారు లోపలి లైట్లు ఎక్కువగా ఉంటే... మీకే నష్టం
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లోపలి లైట్లు ఆన్‌లో ఉంచితే బయట చీకటికి కళ్లకు అలవాటు కాదని చాలా మందికి తెలియదు. అదే కాకుండా గ్లాస్ మీద రిఫ్లెక్షన్స్ వచ్చి ముందున్నది క్లియర్‌గా కనిపించదు. కాబట్టి అవసరమైనంత వరకు మాత్రమే లోపలి లైటింగ్ ఉంచండి.
స్పీడ్ కంట్రోల్ లేకపోతే... ఒక్క క్షణంలో ప్రమాదం
రాత్రిపూట దూరం అంచనా వేయడం కష్టం. అందుకే ముందున్న వాహనం నుంచి గ్యాప్ ఎక్కువగా పెట్టుకోవాలి. అలాగే స్పీడ్ కంట్రోల్‌లో ఉంచకపోతే... ఏ చిన్న అడ్డంకి వచ్చినా రియాక్ట్ అవ్వడానికి టైమ్ ఉండదు.

రాత్రి డ్రైవింగ్ అంటే స్పీడ్ కాదు... స్మార్ట్ డ్రైవింగ్.
కొంచెం ఓపికగా, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ప్రమాదాల నుంచి మీరు మీరే దూరంగా ఉండొచ్చు. రాత్రి డ్రైవింగ్‌ను భయంగా కాకుండా సేఫ్‌గా మార్చుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. పై టిప్స్ ఫాలో అయితే మీ ప్రతి ప్రయాణం టెన్షన్ ఫ్రీగా పూర్తవుతుంది.
మన దేశంలో రోడ్డు ప్రమాదాల గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే, రాత్రిపూట జరిగే ప్రమాదాలే అత్యంత భయంకరంగా ఉంటున్నాయి. పగటిపూట కంటే రాత్రివేళల్లో ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదాల తీవ్రత మాత్రం ఎక్కువే. దీనికి ప్రధాన కారణం విజిబిలిటీ.
చీకటిలో రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుగు కళ్లను మిరిమిట్లు గొలపడం వంటి అంశాలు డ్రైవర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. పైన తెలిపిన జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది. మీ ప్రాణం మీకే కాదు మీ కుటుంబానికి చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications