రేసులో పల్టీలు కొట్టిన నిస్సాన్ జిటి-ఆర్; డ్రైవర్ సేఫ్

By Ravi

స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లతో భీకరమైన యాక్సిడెంట్ చేసినప్పటికీ, డ్రైవర్లు మాత్రం సురక్షితంగా బయటపడుతున్న సంఘటనలను మనం ఇటీవలి కాలంలో అనేకం చూశాం. ఆయా కార్లలో ఉన్న అత్యున్నతమైన భద్రతా ఫీచర్లే సదరు డ్రైవర్ల పాలిట సంజీవినిలుగా మారుతున్నాయి.

తాజాగా.. ఓ కార్ రేస్‌లో కూడా ఇలాంటి ఓ ప్రమాదమే జరిగింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న రేస్ డ్రైవర్ ఓ మలుపు వద్దకు రాగానే, కారు అదుపు తప్పటం, ఆ తర్వాత సినీ స్టైల్‌లో ఫల్టీలు కొట్టుకుంటూ గాల్లోకి ఎగరటం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలోని సదరు రేస్ డ్రైవ్ చిన్నపాటి గాయాలతో బయటపడగలిగాడు. ఆ యాక్సిడెంట్ వీడియోను మీరు కూడా వీక్షించండి.

ఈ వీడియో ద్వారా మేము మిమ్మల్ని రోడ్డుపై రేస్ చేయమనో లేక మితిమీరిన వేగంతో వెళ్లమనో ప్రోత్సహించడం లేదు. ఖాలీగా ఉండే రోడ్లను చూసి కిర్రెక్కిపోయే కుర్రకారూ.. ఈ ప్రమాదాన్ని ఓ ఉదాహరణగా తీసుకొని రోడ్డుపై సురక్షితంగా డ్రైవ్ చేస్తూ, తమ గమ్యాలను క్షేమంగా చేరుకోవాలనేదే మా ఆకాంక్ష.

ఎవరైనా సరే డ్రైవ్ చేసే టప్పుడు ఎల్లప్పుడు తమ దృష్టిని రోడ్డుపై నుంచి పక్కకు మరల్చకుండా, సీట్ బెల్ట్ ధరించి, రోడ్డు నిబంధనలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనం నడపాలి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/DBj7CfbsMIc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2014, 9:11 [IST]
English summary
In a recent race around the mountains a Nissan GT-R participated and from the look of it looks completely stock. This driver loses control while in a corner and skids his car of track. The car is immediately turned into a pile of wreck.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+