తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న తండ్రీకొడుకు.. విద్యుత్‌ స్తంభమే వారిని కాపాడింది, ఎలా అంటే.!!

మీ కళ్ల ముందు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉండొచ్చు. అలాంటి సమయాల్లో అయ్యో పాపం అనకుండా ఉండలేరు. సాధ్యమైనంత వరకూ వారికి సహాయం చేయడానికి యత్నిస్తాం. ఎవరైనా తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంటే.. అదృష్టవంతులు అని ఊపిరిపీల్చుకుంటాం. ఈ ప్రమాదం వీడియో చూస్తే అలా అనుకోవడం ఖాయం..

దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. నిర్లక్ష్యం కారణంగానే చాలా యాక్సిడెంట్లు(Road Accidents) జరుగుతున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే కొందరి నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా అమాయకులు బలయిపోతున్నారు. వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు తండ్రీకొడుకు.

Car-Accident-Nissan-Micra

డ్రైవింగ్ చేసేటప్పుడు రహదారిపై చాలా శ్రద్ధ వహించాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. యాక్సిడెంట్‌కు గురి కాక తప్పదు. ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం(Father And Son Escapes From Car Hit)లో తండ్రీకొడుకు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విద్యుత్‌ స్తంభమే వారిని కాపాడిందని చెప్పవచ్చు. అదెలా అనుకుంటున్నారా.?? ఈ స్టోరీ చదివేయండి మరి..

ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వీడియోను పరిశీలించినట్లయితే.. రోడ్డుపై తండ్రి తన కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా నిస్రాన్‌ మైక్రా ఎస్‌యూవీ వస్తోంది. వేగంగా వస్తున్న కారు కొద్ది దూరంలో వారిని ఢీకొట్టేది. కానీ అకస్మాత్తుగా కారు ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Car-Accident-Nissan-Micra

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో(Car Accident CCTV Footage) రికార్డయ్యాయి. కేరళలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కుమారుడి వయసు మూడేళ్లు లేదా ఆ లోపే ఉండొచ్చు. అయితే చిన్న పిల్లాడు కావడంతో తండ్రి తన కొడుకుని ఎత్తుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో నిస్రాన్‌ మైక్రా డ్రైవర్‌ నిర్లక్ష్యం ఉన్నట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. డ్రైవింగ్‌పై శ్రద్ధ చూపించకపోవడంతో కారును కంట్రోల్‌ చేయడంలో అతను విఫలమైనట్లుగా తెలుస్తోంది. దీని కారణంగా కారు, రోడ్డు పక్కన ఉన్న గోడతో పాటు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం కారు ఆగిపోయింది. అదృష్టవశాత్తు కారు స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడే ఉన్న తండ్రీకొడుకులకు ప్రాణాపాయం తప్పింది.

Car-Accident-Nissan-Micra

కాగా ఘటనలో నిస్సాన్ మైక్రా తీవ్రంగా డ్యామేజ్‌ అయినట్లు కనిపిస్తోంది. ప్రమాదంలో ఫ్రంట్‌ బంపర్, హెడ్‌ల్యాంప్‌లు, బానెట్ దెబ్బ తిన్నాయి. మైక్రా ఫ్రంట్‌ సీట్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు ఆన్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే యాక్సిడెంట్‌ తర్వాత కారులో ఉన్నవారు క్షేమంగా బయటకు వచ్చారు. ఏదేమైనా ఈ ప్రమాదం ఘటనతో రోడ్డుపై ఎలా డ్రైవ్‌ చేయకూడదో గమనించాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 13, 2024, 15:06 [IST]
English summary
Nissan micra hits electric pole father and son escapes miraculously cctv viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+