2009 మోడల్ కారులో వాంఖడే స్టేడియానికి నీతా అంబానీ.. అంత పాత కారులోనే ఎందుకు వెళ్లినట్టు?
భారత్‌లో అత్యంత విలాసవంతమైన గ్యారేజీల్లో అంబానీ ఫ్యామిలీ కార్ల గ్యారేజ్ ఒకటి. దీన్నే "జియో గ్యారేజ్" అని పిలుస్తారు. ఈ గ్యారేజీలో హైఎండ్ సూపర్ కార్లు సహా లగ్జరీ వాహనాలు మరియు SUVలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వాంఖడే స్టేడియానికి వెళ్లిన నీతా అంబానీ బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ S600లో కనిపించారు. మెర్సిడెస్ బెంజ్ S క్లాస్ అంబానీ కుటుంబానికి ఇష్టమైన వాహనంగా కనిపిస్తోంది. దీంతో అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్ గురించి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

నీతా అంబానీ కాన్వాయ్‌లో బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ 6-క్లాస్ S600 సహా 5వ జనరేషన్ S-క్లాస్ సిల్వర్ కలర్ కారు, తెలుపు రంగులో ఉన్న మెర్సిడెస్ బెంజ్ v వాహనం ఉన్నాయి. కాన్వాయ్‌లో ఉన్న బెంజ్ 5వ జనరేషన్ S-క్లాస్ కారు.. జియో గ్యారేజ్‌లోనే అత్యంత పాత కార్లతో ఒకటి. అయినా ఈ కారును ఎక్కువగానే వినియోగిస్తారు. సిల్వర్ కలర్ S క్లాస్ అంబానీ కుటుంబానికి ఇష్టమైన కారుగా కనిపిస్తోంది.
అంబానీ కార్ల కాన్వాయ్‌లో మెర్సిడెస్ బెంజ్ సహా లాండ్ రోవర్, రేంజ్ రోవర్ వంటి అధునాతన, విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటిని అంబానీ కుటుంబం భద్రతను చూసే సెక్యూరిటీ సిబ్బంది వినియోగిస్తారు. MG గ్లోస్టర్, టయోటా ఇన్నోవో కార్లను కాన్వాయ్‌లోని ముంబయి పోలీసులు వినియోగిస్తారు. వీరంతా అంబానీ కుటుంబానికి Z+ కేటగిరి భద్రతను కల్పిస్తారు. వాంఖడే స్డేడియానికి వెళ్లిన నీతా అంబానీ కాన్వాయ్‌లోని కార్ల ధర సుమారు 8-9 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
నీతా అంబానీ కనిపించిన కారు మెర్సిడెస్ బెంజ్ S క్లాస్‌కు చెందినది. ఈ కారును 2009కు చెందిన మోడల్. అంటే సుమారు 14 సంవత్సరాల నాటి కారు ఇది. ఈ S600 కారు 5.5 లీటర్ టర్బోఛార్జడ్ V12 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 51o PS పవర్‌ను మరియు 830 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అంబానీ కుటుంబ సభ్యులు అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తప్ప.. ఇలాంటి పాత కార్లతో కనిపించడం చాలా అరుదు. మెర్సిడెస్ బెంజ్ S600 కారు అప్పట్లో నాన్ AMG వేరియంట్‌కు చెందిన ప్లాగ్‌షిప్ మోడల్. చాలా మంది ఇటువంటి కారును తమ గ్యారేజ్‌లో ఉండాలని కోరుకుంటారు.
అంబానీ కుటుంబం తమ భద్రతా ముప్పును ఎదుర్కోనేందుకు కాన్వాయ్‌లోని వేర్వేరు కార్లను ఉపయోగిస్తుంటారు. వీరికి వ్యక్తిగత సెక్యూరిటీ మరియు CISF భద్రత కల్పిస్తుంది. వీరి కాన్వాయ్‌లో 20 కంటే ఎక్కువ కార్లు ఉంటాయి. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, భద్రతాపరమైన కార్ల కాన్వాయ్‌లో మెర్సిడెస్ బెంజ్ S600 ఒకటి. అంబానీ కుటుంబం ఎక్కువగా వినియోగించే రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లతోపాటు మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సెడాన్‌ను ఎక్కువగా వినియోగిస్తారు.
ప్రస్తుతం ఉన్న కాన్వాయ్‌ని మరింత విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. కాన్వాయ్‌లోని BMW 7 సీరిస్ హై సెక్యూరిటీ కారును అంబానీ గతకొంత కాలంగా వినియోగిస్తున్నారు. ఇదే కారును అంబానీ కుటుంబంలోని మరొకరు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. పాత తరం S క్లాస్ గార్డ్ కూడా కాన్వాయ్‌లో ఉంది.


Click it and Unblock the Notifications








