10 కోట్ల రూపాయల కారును భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖేష్‌ అంబానీ.. కారులో ఎన్నో ప్రత్యేకతలు!

అంబానీ కుటుంబం అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను కలిగి ఉంది. వీరి గ్యారేజీని జియో గ్యారేజీగా పిలుస్తారు. బహుశా దేశంలో అత్యంత ఖరీదైన, లగ్జరీ కార్‌ గ్యారేజీలో ఇది కూడా ఒకటి. ఈ గ్యారేజీలో హై ఎండ్‌ సూపర్‌ కార్లు, లగ్జరీ కార్లు సహా అనేక SUVలు ఉంటాయి.

భార‌్యకు బహుమతిగా.. : జియో గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నప్పుటికి అంబానీ కుటుంబానికి మాత్రం మెర్సిడెస్‌ బెంజ్‌ S క్రాస్‌ కార్లు అంటే చాలా ఇష్టం. ఈ జియో గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ (Rolls Royce Cullinan)ను కొనుగోలు చేశారు. ముఖేష్‌ అంబానీ ఈ కారును తన భార్య నీతా అంబానీకి ఈ కారును బహుమతిగా ఇచ్చారు.

Rolls Royce Cullinan

కారు ధర రూ.10 కోట్లు..! : రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ కారు ప్రత్యేక బ్లాక్ బ్యాడ్జ్‌ ఎడిషన్‌గా తెలుస్తోంది. ఈ కారు ధర రూ.8.2 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది. అదే ఆన్‌రోడ్‌ ధర సుమారు రూ.10 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు భారత్‌లోనే అత్యంత ఖరీదైన కారుల్లో ఒకటిగా ఉందని తెలుస్తోంది.

కాన్వాయ్‌లో ఎన్నో లగ్జరీ కార్లు : నీతా అంబానీ ఈ కొత్త కారులో ప్రయాణించిన వీడియోను CS 12 Vlogs యూట్యూ్బ్‌ ఛానల్‌ పోస్ట్‌ చేసింది. భద్రతా సిబ్బంది కార్ల మధ్య కొత్త రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ కారు కనిపించింది. నీతా అంబానీ కాన్వాయ్‌లో ఎంజీ గ్లోస్టర్, టయాటా ఫార్చ్యునర్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ G కార్లు కూడా ఉన్నాయి.

Rolls Royce Cullinan car

ప్రత్యేక ఎడిషన్‌ : ఈ రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ మోడల్.. స్టాండర్డ్ కారుతో పోలిస్తే ఎక్సీరియర్‌ నలుపు రంగులో ఉంటుంది. అయితే స్టాండర్డ్‌ కారు మాదిరిగా 6.75 లీటర్‌ ట్విన్‌ టర్బోఛార్జడ్‌ V12 పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 600 bhp శక్తి, 900Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 8-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. మరియు శక్తిని నాలుగు చక్రాలకు పంపిస్తుంది.

అనేక ఫీచర్లు : రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ కారు 22 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ మరియు కాంట్రాస్ట్‌ రెడ్‌ బ్రేక్‌ కాలిపర్స్‌ ఉన్నాయి. ఈ కారలో ఫ్రంట్‌ గ్రిల్‌ సరౌండ్‌, సైడ్‌ ప్రేమ్ ఫినిషర్లు, బూట్‌ హ్యాండిల్‌, బూట్‌ ట్రిమ్‌, లోయర్‌ ఎయిర్‌ ఇన్‌టేక్‌ ఫినిషర్‌ మరియు ఎగ్జాస్ట్‌ పైప్‌లపై డార్కెస్ట్‌ క్రోమ్‌ వినియోగించారు.

Mukesh ambani gifts Rolls Royce Cullinan to netha ambani,

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 7, 2023, 17:16 [IST]
English summary
Nita ambani receives special edition luxury rolls royce cullinan of worth 10 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+