నీతి ఆయోగ్ సీఈఓ ఉపయోగించే ఎలక్ట్రిక్ కార్ చూసారా.. అయితే ఇక్కడ చూడండి
నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ (Amitabh Kant) ఇటీవల ట్విట్టర్‌లో ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క ఉపయోగం గురించి తెలిపారు. తాను ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నానని అందులోనూ దేశీయ వాహన తయారీ సంస్థ యొక్క టాటా నెక్సాన్ EV ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగించడానికి చాలా అనుకూలంగా మరియు చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఇది మంచి పరిధిని కూడా అందిస్తుందని ఆయన తెలిపారు.

ఎలక్ట్రిక్ కార్లు డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకేనట కూడా తక్కువ ధరలో కూడా అందుబటులో ఉన్నాయి. కావున వాహన వినియోగదారులు నిరభ్యంతరంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించవచ్చు. భారతదేశంలో ప్రతి రోజూ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల సమయ ప్రజలపైన ఎక్కువ భారం మోపుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగమే దీనికి తగిన పరిష్కారం అని ఆయన అన్నారు. ముడి చమురు ధర ఇప్పటివరకు రికార్డు స్థాయికి ఉన్నాయి, అంతే కాకుండా రానున్న రోజుల్లో వీటి ధరలు రూ. 15 నుంచి రూ. 20 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వినియోగం భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రజలకు తెలియజేస్తున్నాయి. దీనికోసం కేంద్ర ఫేమ్-2 స్కీమ్ కింద భారీ రాయితీలను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత తగ్గింపులను అందిస్తున్నాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ సీఈఓ కూడా దీనిని ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ ప్రజలలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాలను తప్పకుండా పెంచుతుందని ఆశిస్తున్నాము.

భారతదేశంలోని ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రభుత్వాలు కూడా పాటుపడుతున్నాయి. కావున తప్పకుండా ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో రాజ్యమేలుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

మనం ఇదివరకు చెప్పుకుంటున్నట్లు నీటి ఆయోగ్ సీఈఓ 'అమితాబ్ కాంత్' టాటా మోటార్స్ యొక్క Tata Nexon EV ని ఉపయోగిస్తున్నారు. టాటా నెక్సాన్ భారతీయ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను జరిపిన మోడల్. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు విడుదలైనప్పటినుంచి కూడా 13,500 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది.

టాటా మోటార్స్ కంపెనీ గత రెండేళ్లుగా భారత మార్కెట్లో నెక్సాన్ ఈవీలను విక్రయిస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో, కంపెనీ భారతదేశంలో 4,000 యూనిట్ల అమ్మకాలను దాటుతుందని ప్రకటించింది. అంటే కంపెనీ సుమారు 10 నెలల్లో 9,000 Nexon EV కార్లను విక్రయించింది.

టాటా నెక్సాన్ EV నెలకు సగటున 1,000 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా కొత్త రికార్డ్ కైవసం చేసుకుంది. ఇది ప్రైవేట్ కార్ కొనుగోలుదారుల కోసం దేశీయ వాహన తయారీదారు ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం, ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే ఇది భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎలక్ట్రిక్ కారుగా మారింది.

టాటా Nexon EV భారతదేశంలో రూ. 14.29 లక్షల నుండి రూ. 16.90 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విక్రయించబడుతోంది. టాటా నెక్సాన్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

టాటా నెక్సాన్ EV యొక్క మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 30.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్ IP67 ప్రమాణాలకు అనుకూలంగా ఉండటమే కాకుండా, వాటర్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది. ఈ కారు కేవలం 9.58 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకోగలదు. టాటా నెక్సాన్ EV పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత 312 కి.మీ పరిధిని అందిస్తుంది.

టాటా మోటార్స్ తన నెక్సాన్ EVని 3.3 kW ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో అందిస్తుంది, ఇది ఎనిమిది గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అదే సమయంలో, దీనిని 25 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కావునా ఇది వాహన వినియోగదారుల యొక్క సమయాన్ని ఆదా చేస్తుంది.

Nexon EV మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి సిగ్నేచర్ టీల్ బ్లూ, గ్లేసియర్ వైట్ మరియు మూన్‌లైట్ సిల్వర్ కలర్స్. టాటా నెక్సాన్ EVని కంపెనీ యొక్క జిప్‌ట్రాన్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. టాటా టిగోర్ EV కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతోంది. Nexon EVలో డ్యుయల్ పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ లైట్లు, 16-ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, లెదర్-కవర్డ్ స్టీరింగ్ వీల్, పుష్ బటన్ స్టార్ట్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి, కావున ఇది మార్కెట్లో మంచి సంఖ్యలో అమ్మకాలను పొందుతోంది.


Click it and Unblock the Notifications








