ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా, భారతీయ పౌరులలో ఇ-మొబిలిటీ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ఏజెన్సీ ఇ-అమృత్ (e-Amrit) పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్ (యాప్) ను ప్రారంభించింది. E-Amrit ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు యొక్క అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించిన పోర్టల్.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా భారతదేశ ఇంధన నిల్వ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. E-Amrit మొబైల్ యాప్ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలను అంచనా వేయడానికి, పొదుపులను నిర్ణయించడానికి మరియు భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరియు పరిశ్రమ యొక్క అభివృద్ధి గురించిన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

నీతి ఆయోగ్ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం, ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశం 600 GWh బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. ఈ నివేదికలోని విశ్లేషణ ఆధారంగా, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ నిల్వ మొత్తం గరిష్టంగా 600 GW (గిగా వాట్లు) గా ఉంటుందని చెప్పబడింది. ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాలు భారతదేశంలో ఈ బ్యాటరీ శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

'అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ రీయూజ్ అండ్ రీసైక్లింగ్ మార్కెట్ ఇన్ ఇండియా' పేరుతో విడుదల చేసిన నివేదికలో, 'భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), స్టేషనరీ స్టోరేజీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో బ్యాటరీ స్టోరేజీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని నీతి ఆయోగ్ తమ నివేదికలో పేర్కొంది. విద్యుత్ గ్రిడ్‌లో రవాణా మరియు బ్యాటరీ పవర్ స్టోరేజ్, బ్యాటరీ డిమాండ్ పెరుగుదలలో ప్రధానమైన విభాగాలుగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు ఆటో పరిశ్రమ కూడా కృషి చేయాల్సి అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ అన్నారు. వచ్చే దశాబ్దం నుంచి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగవంతం అవుతుందని ఆయన అన్నారు.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

దేశంలో ఇప్పటికే 13 లక్షల ఈ-వాహనాలు నమోదయ్యాయి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా తయారీదారులు కూడా కొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకూ దేశంలో 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ జాబితాలో ఇంకా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్‌లలో విక్రయించిన ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌ వివరాలను చేర్చలేదని ఆయన వివరించారు.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) నివేదిక ప్రకారం, 2050లో భారతదేశం యొక్క కొత్త ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో 75 శాతం వాహనాలు ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయని అంచనా వేసింది. అలాగే, 2030 నాటికి భారతదేశంలో కొనుగోలు చేయబడే మొత్తం ద్విచక్ర వాహనాల్లో దాదాపు 50 శాతం మరియు నాలుగు చక్రాల వాహనాల్లో దాదాపు 50 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌గా ఉంటాయని ఏజెన్సీ పేర్కొంది.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలో కేవలం రవాణా రంగం మాత్రం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 21 శాతం వినియోగించే అవకాశం ఉందని అంచనా వేయబడింది. దీనితో పాటు, అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల నుండి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తోంది. దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు నెమ్మదిగా ఉండటం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. అదనంగా, విడిభాగాలు మరియు సెమీకండక్టర్ల కొరత కూడా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను ప్రభావితం చేస్తోందని సిఇఇడబ్ల్యూ అభిప్రాయపడింది.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

ఎలక్ట్రిక్ వాహనాలు నిశ్శబ్దంగా ఉండకూడదు

ఎలక్ట్రిక్ వాహనాలు సున్నా కర్బన వ్యర్థాలను విడుదల చేస్తూ ప్రకృతి సాన్నిహిత్యంగా ఉండటమే కాకుండా, పెట్రోల్/డీజిల్ వాహనాల మాదిరిగా పెద్ద శబ్ధం చేయకుండా సైలెంట్ గా సాగిపోతుంటాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్లు చాలా నిశ్శబ్దంగా ఉండకూడదని ప్రభుత్వం చెబుతోంది. ఈవీలు నిశ్శబ్ధంగా ఉండటం వలన రోడ్డుపై పాదచారులు అప్రమత్తంగా ఉండలేరని ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కమిటీ కొత్త నియమాన్ని కూడా ప్రవేశపెట్టబోతోంది.

ఇ-అమృత్ (E-Amrit) మొబైల్ యాప్‌ని విడుదల చేసిన నీతి ఆయోగ్.. ఈ యాప్ ఎందుకంటే..?

ఈ నిబంధన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలతో పాటు గూడ్స్ క్యారియర్‌లకు కూడా వర్తిస్తుంది. ఈ కొత్త నియమాలు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR), 1989కి జోడించబడే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త రూల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులు తమ ఈవీలలో కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత ఈవీ కంపెనీలు తమ వాహనంలో ఎకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను నడిపే వారికే కాకుండా పాదచారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Niti aayog launches e amrit mobile app to promote electric mobility in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X