ఒక్క మంచి పని.. రూ.25,000 బహుమతి.. ప్రమాద బాధితుడికి హెల్ప్ చేసి పరార్ అవ్వకండి.. క్యాష్ తీసుకెళ్లండి!
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అత్యంత సమస్యలలో రోడ్డు ప్రమాదాలు ఒకటి. ప్రతి ఒక్క నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతోంది. మరింత ఆందోళనకరంగా, ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మనిషి ప్రాణం కోల్పోతున్నాడు. ఈ దారుణ స్థితిని మారుస్తూ, సమాజంలోని బాధ్యతాయుతమైన పౌరుల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల "రహ్‌వీర్ పథకం" పేరిట ఒక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకానికి వెనుక ఉన్న మూల ఉద్దేశ్యం "గోల్డెన్ అవర్"లో రోడ్డుప్రమాద బాధితుడికి సరైన వైద్య సహాయం అందేలా చేయడం. ఎవరికైనా రోడ్డుప్రమాదం జరిగిన సమయంలో బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినందుకు గుర్తుగా రూ.25,000 ప్రోత్సాహక బహుమతిని ప్రభుత్వం అందించనుంది.
ఇది కేవలం డబ్బు కాకుండా, సమాజానికి ఒక సంకేతం, మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అన్న సందేశం. ప్రమాదం జరిగిన 60 నిమిషాల్లోపు బాధితుడిని ఆసుపత్రికి చేరుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తే వారికి ప్రోత్సాహక బహుమతి ఇది. "గోల్డెన్ అవర్"లో వైద్య సహాయం అందితే బాధితుడి ప్రాణాన్ని కాపాడే అవకాశం అత్యధికంగా ఉంటుంది. అత్యవసర సమయాల్లో బాధితుడికి దగ్గరగా ఉన్నవారు వేగంగా స్పందించడానికి ఇది కొంత తోడ్పాటుగా ఉంటుంది.

గతంలో, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే అనవసర సమస్యల్లో చిక్కుకుంటామో అన్న భయంతో చాలా మంది సహాయం చేయకుండా వెనకడుగు వేసేవారు. పోలీసుల ప్రశ్నలు, కేసులు వంటి సమస్యలు వస్తాయని బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో కాస్త వెనకుడుగు వేసేవారు. దీంతో దీనికి పరిష్కారంగా "రహ్‌వీర్ పథకం"ను కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
జీన్యూస్‌లో వచ్చిన కథనం ప్రకారం, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ జీ భారత్ షో 'భారత్ కీ ఉడాన్ - ఎ జీ భారత్ ఇనిషియేటివ్' కార్యక్రమంలో ప్రసంగిస్తూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సహాయం చేయడం మన మానవతా కర్తవ్యం అని స్పష్టం చేశారు. కానీ గతంలో, అటువంటి సహాయ చర్యలు చేసిన వారు, పోలీసుల వేధింపులకు గురయ్యారనే అభిప్రాయాలు వినిపించేవి.

ఈ సమస్యను అర్థం చేసుకున్న ప్రభుత్వం, దీనిపై స్పష్టమైన విధానాన్ని రూపొందించిందని మంత్రి తెలిపారు. గడ్కరీ వెల్లడించిన ప్రకారం, ఇప్పుడు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ఎలాంటి నేర పరమైన చిక్కులు ఉండవని, పరోక్షంగా ప్రభుత్వమే వారిని రక్షించనున్నదని ఆయన హామీ ఇచ్చారు. పైగా, గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆసుపత్రికి చేర్చే వారికి రూ. 25,000 నగదు బహుమతిని అందించే "రహ్‌వీర్" పథకంను ప్రకటించారు.
ఈ పథకం వల్ల ఒకవైపు ప్రాణాలు కాపాడే అవకాశం పెరుగుతుంది. "రహ్‌వీర్" ద్వారా, రోడ్డు ప్రమాదాల తరువాత ప్రజలు అక్కడి నుంచి పారిపోవడం కాదు, బాధితుడి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో దృఢంగా ప్రజలకు సూచిస్తోందని అన్నారు. ప్రమాద బాధితులను సరిగ్గా ఎలా రక్షించాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి, వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయని మంత్రి అన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








