నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో వ్యవస్థల్లో కూడా భారీ మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'ఫాస్టాగ్'(FASTag) విధానానికి కేంద్రం మంగళం పాడటానికి సిద్ధమైపోయింది. త్వరలో జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టం అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో వ్యవస్థల్లో కూడా భారీ మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'ఫాస్టాగ్'(FASTag) విధానానికి కేంద్రం మంగళం పాడటానికి సిద్ధమైపోయింది. ఫాస్టాగ్ విధానంలో రానున్న టెక్నాలజీ ఏది? అదెలా పనిచేస్తుందనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

నేషనల్ హైవే మీద ట్రాఫిక్ తగ్గించడానికి కేంద్రం ఈ ఫాస్టాగ్ విధానం అమలులోకి తీసుకువచ్చిన విషయం అందరికి తెలుసు. ఇక త్వరలో ఈ సిస్టం కనుమరుగు కానుంది. దీని స్థానంలో జీపీఎస్ టోల్ కలెక్షన్ (GPS Toll Collection) అందుబాటులో రానుంది. టోల్ కలెక్షన్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ కొత్త ప్రణాళికలు రచించారు.
జీపీఎస్ టోల్ కలెక్షన్ విధానం ద్వారా హైవేపైన వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఫాస్టాగ్ విధానం ద్వారా.. సదరు వాహనదారుని బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా అమౌంట్ తీసుకోవడం జరిగేది. జీపీఎస్ విధానం ద్వారా ఒక వాహనదారుడు హైవే మీద ఎంతదూరం ప్రయాణించారు అనేదాన్ని బేస్ చేసుకుని రుసుము వసూలు చేయడం జరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న టోల్ సిస్టంకు ముగిమౌ పలుకుదాం.. ఇకపైన శాటిలైట్ బేస్డ్ టోల్ వసూలు వ్యవస్థను ఆహ్వానిద్దాం. మీ బ్యాంకు ఖాతా నుంచి.. మీరు ప్రయాణించిన దూరాన్ని బట్టి చార్జెస్ వసూలు చేసే కొత్త విధానం ఇది. వాహనం వినియోగదారుల సమయం ఆదా అవుతుంది. తద్వారా ఇంధనం కూడా ఆదా అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
నేషనల్ హైవే మీద ఎక్కువ టోల్ ప్లాజాలు ఉంటే.. అక్కడ వాహనాన్ని కొంత సేపు ఆపాలి, లేకుంటే నెమ్మదిగా వెళ్ళాలి. దీని ద్వారా ఇంధన నష్టం కూడా కొంతమేర జరుగుతుంది. దీనిని పూర్తిగా నివారించడానికి టోల్ సిస్టం తీసివేయడం జరుగుతుంది. అంతే కాకుండా హైవేల మీద కావలసిన మౌలిక సదుపాయాలు కూడా ప్రవేశపెడతామని, టోల్ వసూలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని గడ్కరీ పేర్కొన్నారు.

2024 చివరి నాటికి భారతదేశంలో యొక్క భవితవ్యం మారుతుంది. జాతీయ రహదారుల నెట్‌వర్క్ అగ్ర రాజ్యమైన అమెరికాతో సమానంగా నిలుస్తుంది. అదే నా లక్ష్యం. ఇందులో తప్పకుండా విజయం సాధిస్తానని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోదీ దార్శినికతకు సహకరించడంలో రోడ్డు రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తోందని గడ్కరీ అన్నారు.
టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా ఆపలేకపోతున్నందుకు బాధగా ఉందని. దీనికి వాహన వినియోగదారులు కూడా తప్పకుండా సహకరించాలని గడ్కరీ అన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నిస్తామని వాగ్దానం చేశారు. వాహన వినియోగదారులకు కూడా రోడ్డు భద్రతలను గురించి అవగాహన కల్పిస్తామని అన్నారు. వాహనదారులు కూడా తప్పకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తమ వంతు కృషి చేయాలనీ అన్నారు.
జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ ఎలా పనిచేస్తుందంటే..
ఇప్పుడున్న ఫాస్టాగ్ మాదిరిగా కాకుండా జీపీఎస్ టోల్ కలెక్షన్.. ఆటోమాటిక్ లైసెన్స్ ప్లేట్ రీడింగ్ టెక్నాలజీతో కూడిన కెమెరాల ద్వారా వసూలు చేయడం జరుగుతుంది. అంటే మీ వాహనం యొక్క స్థానాన్ని ట్రాక్ చేసే జీపీఎస్ శాటిలైట్‌తో ట్రాక్ చేసి.. ప్రయాణ దూరాన్ని లెక్కించి టోల్ మొత్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇది లైసెన్స్ ప్లేట్‌కి లింక్ చేయబడి.. ముందుగా నమోదు చేయబడిన అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా అమౌంట్ కట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








