Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

భారతదేశంలో హైవేల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే యొక్క పురోగతిని సమీక్షించారు. ఈ ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై Nitin Gadkari యొక్క Kia Carnival గంటకు 170 కిమీ వేగంతో వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విడుదలైంది. ఇందులో Gadkari కూడా ఉన్నారు.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

ఢిల్లీ మరియు ముంబై రెండు ముఖ్యమైన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరుగుతోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై కేంద్ర మంత్రి Gadkari ఎక్కువ సమయం గడిపారు. ఆ సమయంలో ఈ రహదారి వేగ పరిమితిని కూడా పరీక్షించినట్లు తెలిసింది.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

దీనికి సంబంధించి విడుదలైన ఈ వీడియోలో, Nitin Gadkari కియా కార్నివాల్‌లో కో-డ్రైవర్ సీట్లో కూర్చుని ఉండటం మీరు గమనించవచ్చు. ఆ సమయంలో Gadkari హైవే గురించి కొన్ని ప్రశ్నలు అడగడం మరియు ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఎంత వేగాన్ని నిర్వహించగలదో కూడా ఇందులో చూడవచ్చు.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

Gadkari మరియు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో సంభాషించడం కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో కారు కట్ నుండి యు-టర్న్ తీసుకుంది మరియు ఆ తర్వాత కియా కార్నివాల్ డ్రైవర్ కారును వేగవంతం చేయడం ప్రారంభించాడు. ఈ వీడియోలో కియా కార్నివాల్ అతి తక్కువ సమయంలో అధిక వేగం సాధించినట్లు చూడవచ్చు.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే, Kia Carnival 170 కిమీ/గం వేగాన్ని తాకుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం వాహనదారులు గుర్తుంచుకోవాలి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రస్తుతం సాధారణ ప్రజల కోసం తెరవబడలేదని, కావున ఆ హైవే మొత్తం నిర్మానుష్యంగా ఉంది. కావున ఆ సమయంలో Nitin Gadkari కాన్వాయ్ ఈ వేగంతో వెళ్ళింది.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

ఆ సమయంలో అతను ఈ స్పీడ్ టెస్ట్ చేసాడు, అయితే వారు సురక్షితంగానే ఉన్నట్లు తెలిసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కిలోమీటర్లు. అయితే ఏదేమైనా, అవసరమైతే త్వరిత అత్యవసర సేవలు మరియు అత్యవసర విమానాల ల్యాండింగ్‌ల కోసం ఇది చాలా అధిక వేగాలను నిర్వహించగలదు.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

ఈ నెల ప్రారంభంలో, నితిన్ గడ్కరీ మరియు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజస్థాన్‌లోని బార్మర్‌లో జాతీయ రహదారి-925 లో గాంధవ్ భాస్కర్ సెక్షన్‌లో అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్‌ను ప్రారంభించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఈ హైవే మీద ల్యాండ్ చేసింది, ఈ కొత్త సెక్షన్‌లో ల్యాండ్ అయిన మొదటి ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అయింది. ఇది కాకుండా, భారత వైమానిక దళం సుఖోయ్-30 MKI మరియు జాగ్వార్ యుద్ధ విమానాలను కూడా ఈ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ చేసింది.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

త్వరలో ప్రారంభం కానున్న ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే కానుంది. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఢిల్లీ మరియు ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 1,380 కిలోమీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణనికి అయిన ఖర్చు దాదాపు రూ. 98,000 కోట్లు. హైవే యొక్క మొత్తం పొడవులో, 1,200 కిమీ రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ ఇప్పటికే ఇవ్వబడింది. మిగిలిన మొత్తం కూడా త్వరలో ప్రారంభమవుతుంది.

భారతదేశంలో ప్రతి ఏటా ఎంతోమంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఒక కారణమైతే, సరైన రోడ్డు వ్యవస్థ లేకుండా పోవడం మరొక ప్రధాన కారణం. సరైన రోడ్లు లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి.

భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది మరణిస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన మితిమీరిన వేగంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. చాలా మంది వాహనదారులు మితిమీరిన వేగంతో నిర్లక్యమైన డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి వాటిని నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించలేకపోతున్నారు.

Kia Carnival 170 స్పీడ్‌లో Nitin Gadkari [వీడియో]

రోడ్డు ప్రమాదాల సంఖ్యను భారీగా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అద్భుతమైన రోడ్లను అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్నారు. అయితే ఈ రోడ్లపై ప్రయాణించే వారు పరిమిత వేగంతో ప్రయాణిస్తే, ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చు. కావున వాహనదారులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Nitin gadkari speed test on delhi mumbai expressway in kia carnival video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X