కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం నాడు కాశ్మీర్‌లో నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ మరియు జెడ్-మోర్ టన్నెల్‌ని తనిఖీ చేసి, సమీక్షించనున్నారు. నేషనల్ హైవేస్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) ద్వారా అమలు చేయబడిన ఈ రెండు ప్రాజెక్టులు షెడ్యూల్ కంటే ముందే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

గత వారం కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. జోజిలా సొరంగ మార్గం (టన్నెల్) మొత్తం 14.15 కిమీ పొడవుతో ఆసియాలో పొడవైన ద్వి-దిశాత్మక సొరంగం (బై-డైరెక్షనల్ టన్నల్) అవుతుంది. అంటే, ఈ సొరంగ మార్గంలో ఇరువైపులా వాహనాల రాకపోకలకు వీలుగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ని రూ. 4,500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న NH-01 పై 2,700 m నుండి 3,300 m ఎత్తులో ఉంది.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

జోజిలా సొరంగం NH-1 లోని శ్రీనగర్ లోయ మరియు లేహ్ (లడఖ్ పీఠభూమి) మధ్య అన్ని వాతావరణాల్లోనూ కనెక్టివిటీని అందించేలా రూపొందించబడింది. ఈ టన్నల్ శ్రీనగర్ మరియు లేహ్‌ని ద్రాస్ మరియు కార్గిల్‌ని కలుపుతూ NH-1 లో జోజిలా పాస్ కింద (ప్రస్తుతం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే ఉపయోగంలో ఉండే రోడ్డు) సుమారు 3000 మీటర్ల ఎత్తులో 14.15 కిమీ పొడవు మేర ఉంటుంది.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

వాహనాలు నడపడానికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్ట్రెచ్‌లలో (మార్గాలలో) జోజిలా పాస్ కూడా ఒకటిగా పరిగణించబడింది. ఈ రోడ్డు సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఉపయోగంలో ఉంటుంది. మిగిలిన ఆరు నెలల్లో మంచు, వర్షాల కారణంగా మూతపడి ఉంటుంది. అయితే, ఈ జోజిలా సొరంగ మార్గం నిర్వహణలోకి వచ్చినట్లయితే, ఇరు ప్రాంతాల మధ్య ఏడాది పొడవునా రాకపోకలు సజావుగా సాగే అవకాశం ఉంది.

ఈ సొరంగం కాశ్మీర్‌లోని బల్తాల్ మరియు లడఖ్‌లోని మినమార్గ్ మధ్య ఉన్న 40 కిలోమీటర్ల దూరాన్ని 13 కిలోమీటర్లకి తగ్గిస్తుంది, అలాగే ఏడాది పొడవునా శ్రీనగర్ మరియు లడఖ్ మధ్య ప్రయాణీకులకు అన్ని రకాల వాతావరణాల్లో రవాణా సాధ్యంగా ఉంటుంది.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

మరోవైపు, రూ. 2,378 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జెడ్-మోర్ సొరంగ మార్గం కాశ్మీర్ లోయలోని గన్‌గీర్‌తో సోన్‌మార్గ్‌ని కలుపుతుంది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో కూడా భారీ హిమపాతం వలన చాలా రహదారులు మూసుకుపోతుంటాయి. కాబట్టి, ఈ జెడ్-మోర్ సొరంగం ప్రజలకు అందుబాటులోకి వస్తే, ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

సాధారణంగా, శీతాకాలంలో కురిసే విపరీతమైన మంచు కారణంగా, సోన్‌మార్గ్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే దారులు మూసుకుపోతాయి. రోడ్ కనెక్టివిటీ నిలిచిపోవడం కారణంగా, అవసరమైన సామాగ్రిని రవాణా చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం జెడ్-మోర్ టన్నెల్ నిర్మించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది మరియు ఇప్పుడు దానిని పూర్తిస్థాయిలో అమలుచేస్తోంది.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

సముద్ర మట్టం నుండి సుమారు 8,500 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ సంవత్సరంలో 5-6 నెలల పాటు మూసివేయబడుతుంది. ఈ కారణంగా కశ్మీర్‌ మరియు లడఖ్‌ల మధ్య రవాణా సంబంధాలు కూడా నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో, ఆల్‌రౌండ్ మరియు ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం, సోన్‌మార్గ్ మరియు లడఖ్‌లను కలుపుతూ ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రెండు సొరంగాలు కూడా పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా ఉన్నందున ఇవి భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతాయి. ప్రస్తుతం ఉన్న శ్రీనగర్-లడఖ్ హైవే శీతాకాలంలో కనీసం ఆరు నెలలు మూసివేయబడుతుంది. ఫలితంగా, ఈ మార్గంలో అన్ని రకాల రవాణా నిలిచిపోతుంది. అయితే, ఈ టన్నల్ పూర్తయిన తర్వాత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది సాయుధ దళాలకు ఉచిత కదలికను అందించడంలో సహకరిస్తుంది.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

దేశంలో రోడ్డు భద్రతను పెంచేందుకు రూ. 7270 కోట్లు..

ఇదిలా ఉంటే, భారతదేశంలో రోడ్డు భద్రత (Road Safety) ను మెరుగు పరచేందుకు మరియు దేశంలోని రోడ్లపై సున్నా రోడ్డు ప్రమాదాల లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ (MoRTH) భారీ నిధులను ప్రకటించింది. ఈ మేరకు దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన 14 రాష్ట్రాలను కేంద్ర మంత్రిత్వ శాఖ గుర్తించింది.

కాశ్మీర్‌లో ఆసియాలోనే పొడవైన సొరంగ మార్గం; ఇది మనకు ఎంత అవసరమో తెలుసా?

ఈ 14 రాష్ట్రాలలో రోడ్డు భద్రతను పెంచడానికి కేంద్రం రూ. 7,270 కోట్ల పథకాన్ని ప్రకటించింది. కేంద్రం గుర్తించిన ఈ 14 రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిషా, హర్యానా మరియు అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో రోడ్డు భద్రతను మెరుగుపరచడమే కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పైన పేర్కొన్న రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య సుమారు 85 శాతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఆయా రాష్ట్రాలలో రోడ్లను అభివృద్ధి చేయడం, రోడ్లపై భద్రతను పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలని కేంద్రం నిర్ణయించింది.

Most Read Articles

English summary
Nitin gadkari to inspect zojila z morh tunnel asia s longest bi directional tunnel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X