కారు కొంటున్నారా..? వందలో 10 మందికి కూడా ఈ వివరాలు పూర్తిగా తెలియవు.. సీసీ, బీహెచ్‌పీ, ఎన్‌ఎమ్ టార్క్ డీటైల్స్
కారు కొనుగోలు చేసే చాలామంది వినియోగదారులకు వాటికి సంబంధించిన టెక్నికల్ టెర్మీనాలజీ(సాంకేతిక పదాలు) తెలియక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతారు. కారు కొనుగోలు చేసేటప్పుడు సిబ్బంది కూడా దీనిపై సరైన వివరణ ఇవ్వకపోవచ్చు. కారు కొనేటప్పుడు ఇక్కడ మేము చెప్పబోయే విషయాలు వినియోగదారులను కొంతమేర ఉపయోగపడవచ్చు.
మనలో చాలామంది కారు కొనేటప్పుడు ఎక్కువగా మైలేజ్, డిజైన్, ఫీచర్లు ఇతర అంశాలను చూసి గుడ్డిగా కార్లను కొనేస్తారు. ఇలా చేస్తే మీరు పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే ఇంజన్ సామర్థ్యం దాని ఫర్ఫామెన్స్ అనేది కారు కొనుగోలు చేసేటప్పుడు చాలా కీలకం అని గుర్తుంచుకోవాలి. కారుకి సంబంధించిన బ్రౌచర్, వార్తల్లో లేదా సిబ్బందిని అడిగి ఫర్ఫామెన్స్ వివరాలు తెలుసుకోవాలి.

కారులో CC, BHP(Brake horsepower), NM టార్క్(న్యూటాన్ మీటర్) అనేవి ముఖ్యమైనవి. మీరు వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో ఇంజన్ సామర్థ్యం CC, BHP, టార్క్ విషయాలను ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. కారు లేదా ఇవే చాలా కీలకం. CC, BHP, టార్క్ లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
వాహనంలో CC అంటే క్యూబిక్ సామర్థ్యం అని అర్థం. ఇంజన్ అనేది పిస్టన్ ద్వారా పనిచేస్తుంది దానిద్వారా ఇంధనం ప్రవహిస్తుంది, పిస్టన్ పరిమాణం ప్రతి ఇంజిన్‌లో భిన్నంగా ఉంటుంది. పిస్టన్ బోర్ పరిమాణాన్ని CC అంటారు. ఉదా.. 1000cc ఇంజన్ పిస్టన్ సామర్థ్యం 1 లీటర్. ఈ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, వాహనం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అర్థం.

టార్క్ అనగా ట్విస్టింగ్ ఫోర్స్ తిప్పడానికి లేదా ముందుకు వెళ్లడానికి ఉపయోగించే శక్తి అని దీని అర్థం. ఇంజన్ లో పిస్టన్ కదులుతున్నప్పుడు, దాని క్రాంక్ షాఫ్ట్ పైకి, క్రిందికి వేగంగా తిరుగుతుంది, దీని కారణంగా కారు ముందుకు కదులుతుంది. దీని కొలిచే యూనిట్ ని న్యూటన్ మీటర్ అంటారు. దీని ద్వారా వాహనం వేగంగా వెళ్లగలదా అలానే అధిక భారాన్ని మోయగలదా అనే సామర్థ్యం తెలుస్తుంది.
ముఖ్యంగా పెట్రోలు వాహనాలు తక్కువ టార్క్ ని కలిగి ఉంటాయి. ఎందుకంటే పెట్రోల్ కి త్వరగా మండిపోయే స్వభావం ఉంటుంది, అయితే డీజిల్ ని బర్న్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి డీజీల్ కార్లు లేదా వాహనాలు ఎక్కువ టార్క్ ని కలిగి ఉంటాయి. అందుకే భారీ వాహనాల్లో డీజిల్ ఇంజన్లను వినియోగిస్తారు.

చాలా మంది వ్యక్తులకు BHP, HP మధ్య తేడా తెలియదు. BHP అనగా బ్రేకేజ్ హార్స్ పవర్, HP అంటే హార్స్ పవర్ అని అర్థం. హార్స్ పవర్ అంటే వాహనంలో అమర్చిన ఇంజన్ ఎంత స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేస్తుందో తెలుపుతుంది.
అలానే బ్రేకేజ్ హార్స్ పవర్ అనేది ఇంధనం బర్న్ అవ్వడం ద్వారా ఉత్పత్తి చేయబడిన మొత్తం శక్తి నుంచి AC, ఆల్టర్నేటర్, వాటర్ పంప్ శక్తిని తీసివేసిన తర్వాత వాహనం నడపడానికి కావాల్సిన స్వచ్ఛమైన డ్రైవ్ శక్తిని సూచిస్తుంది. ఇలా ఏదైనా బైక్ లేదా కారు శక్తిని పొందుతాయి. ఫర్ఫామెన్స్ ఆధారంగా మీరు వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








