డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిలిపివేసిన ప్రభుత్వం, ఎక్కడంటే.. ?
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన కారణం. ఎక్కువగా రాత్రిపూట మందు తాగి వాహనాలు నడపడం వల్ల చాల వరకు ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలను ఆపడానికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి జరిమానాలు విధించడం జరుగుతుంది.

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు మందు తాగి డ్రైవ్ చేసేవారిని గుర్తించడానికి బ్రీత్ ఎనలైజర్ ఉపయోగించబడుతుంది. ఈ బ్రీత్ ఎనలైజర్ ఒక వ్యక్తి తాగాడా లేదా అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా అయితే ఈ బ్రీత్ ఎనలైజర్ ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే చాల మంది వాహనదారులకు ఒకే బ్రీత్ ఎనలైజర్ ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తి చాలా తొందరగా జరుగుతుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం ఇటీవల కాలంలో నిషేధించింది. కరోనావైరస్ ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజూ చాలా మంది ప్రజలు ఈ వైరస్ వల్ల చనిపోతున్నారు.

ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తి అనేది ఒకరి నుంచి మరొకరికి చాల తొందరగా వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకర వైరస్ ని నిరోధించడానికి మనదేశంలో కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నివారణ చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా పూర్తిగా నిలిపివేసింది.

వాస్తవానికి చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 124 కి పైగా దేశాలకు వ్యాపించింది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ వైరస్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

వైరస్ ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉండటానికి ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో చాలా బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని ఆదేశించారు. అంతే కాకుండా పాఠశాలలు మరియు కళాశాలలకు కూడా సెలవు మంజూరు చేయబడింది.

తమిళనాడు తరువాత, ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షను నిలిపివేశారు. అడిషినల్ పోలీసు సూపరింటెండెంట్ వినయ్ గార్గావోంకర్ దీనికోసం ఒక సర్క్యులర్ జారీ చేశారు.

ఒక వ్యక్తికి కరోనా ఉంటే ఆ వ్యక్తి ద్వారా పక్కన ఉన్నవారికి వ్యాపించే అవకాశం ఉంది. దీనిని కొంతవరకు తగ్గించడానికి మహారాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అనేక మార్గాలద్వారా వ్యాప్తి చెందుతుంది.

కరోనా వైరస్ ప్రభావం వల్ల మహారాష్ట్రలో ఇప్పటికి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు చాలా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది.

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి తొందరగా వ్యాపిస్తుంది కనుక ఈ ప్రాంతాలలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించారు. అంతే కాకుండా ఈ కరోనా వైరస్ నుండి రక్షణ పొందటానికి అనువైన మాస్క్ ల వంటి పరికరాలను ధరించడం మంచిది.


Click it and Unblock the Notifications








