అక్కడ హెల్మెట్ ధరించకుండా వెళితే పెట్రోల్ విక్రయించరు!!

No Helmet-No Petrol
పల్లె, కానీ పట్టణం కానీ రోడ్డు మీద టూవీలర్‌పై సవారీ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ట్రాఫిక్ పోలీసుల నిబంధనల కోసమో లేక వారు విధించే ఫైన్‌ను తప్పించుకోవడం కోసం హెల్మెట్‌ను ధరించడం కాదు, అది మన ప్రాణ రక్షణకే మంచిదనే వాస్తవాన్ని గ్రహించాలి. హెల్మెట్ వాడకంపై ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నారు.

అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా కలెక్టర్ వినూత్న ఆదేశాలను జారీ చేశారు. హెల్మెట్ ధరించకుండా పెట్రోల్ పట్టించుకునేందుకు పెట్రోల్ బంకులకు వెళితే వారికి పెట్రోల్ ఫిల్ చేయరాదని భోపాల్ జిల్లా కలెక్టర్ మనోజ్ శ్రీవాత్సవ్ కొత్త నిబంధనలు జారీ చేశారు. అంతేకాకుండా.. వాహన చోదకులు ఈ నిబంధనను ఉల్లఘిస్తే.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)లోని సెక్షన్ 188 ప్రకారం వారికి జరిమానా కూడా విధించడం జరుగుతుంది.

ఇంకా పెట్రోల్ బంకుల వద్ద బైక్ రైడర్లు గుంపులుగా చేరి గొడవలకు దిగటాన్ని నిర్మూలించేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 144 ప్రకారం నిషేదాజ్ఞలు కూడా జారీ చేసింది. పెట్రోల్ బంకుల్లో ఐదుగురు లేదా అంతకు మించి గుంపులు ఏర్పడటాన్ని నిషేదించారు. భోపాల్‌లో మే 10, 2011 నుంచి ఇప్పటి వరకూ 45,000 వేల హెల్మెట్ ధరించని వారిపై జరిమానా విధించి, వారి దగ్గర నుంచి మొత్తం రూ. 20 లక్షలు వసూలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

అలాగే కళాశాల విద్యార్థులు కూడా హెల్మెట్‌లను ధరించడం తప్పనిసరి చేసేలా సిటీలోని కాలేజీలకు నోటీసులు పంపించామని శ్రీవాత్సవ తెలిపారు. ఇటీవలే నోయిడా, యూపీలోని ఫరూఖాబాద్ వంటి పట్టణాల్లో ఇలాంటి ఆదేశాలనే జారీ చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, May 23, 2011, 12:48 [IST]
English summary
Bhopal administration issued new orders to mandate the wearing of Helmet while riding on city roads. The administration here has instructed all petrol vends in the city to sell petrol only if the rider is wearing a helmet, Bhopal District Collector Manoj Srivastav said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+