హీల్స్‌ వేసుకుని డ్రైవింగ్‌ చేస్తే నేరం.. ఈ రూల్‌ గురించి ఎప్పుడైనా విన్నారా?

భారతదేశంలో రోడు సేఫ్టీకి సంబంధించి కఠిన ఆంక్షలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. రోడ్లపై నిర్లక్ష్యంగా కార్లను లేదా ఇత వెళ్లే వారికి చట్టరీత్య చర్యలు తీసుకోనున్నారు. తాజాగా మేము చెప్పబోయే ప్రత్యేకమైన రహదారి నియమం మిమ్మల్నీ ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేటప్పడు డ్రైవర్‌ ఏకాగ్రత దెబ్బతినకూడదు. అలా జరిగితే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. దీనికోసం మన చుట్టుపక్కల ఏకాగ్రత దెబ్బతినకుండా ఎలాంటి వస్తువులు కానీ మన బాడీకి ఇబ్బందికి గురిచేసేవి ఉండకూడదు. చాలామంది చెప్పుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల కాస్త ఇబ్బందికి లోనవుతారు.

అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు హీల్స్ ధరించకూడదని చట్టం చెబుతోంది. డ్రైవర్లు తమ వాహనాలపై నియంత్రణ కలిగి ఉండేలా కేవలం రహదారిపై మాత్రమే ఫోకస్‌ చేసేలా ఈ రూల్‌ ఉంది. రహదారి భద్రతను ప్రోత్సహించడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. హై హీల్స్ కారు పెడల్స్‌ని సమర్థవంతంగా ఆపరేట్ చేసే డ్రైవర్ సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుందని చట్టం చెబుతోంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది కూడా యాక్సిడెంట్లకు ప్రధాన కారణంగా ఉంది.

No-High-Heel-Driving-In-India

ఈ నియమం నమ్మలేని చట్టంలా అనిపించినప్పటికీ ఇది ఇప్పటికీ అమలులో ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది పెడల్‌ నియంత్రణలో కాళ్లకు ధరించిన చెప్పులు కీలకం. కాబట్టి హీల్స్ వంటి వాటి వల్ల ప్రమాదాల జరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది డ్రైవర్లు, ముఖ్యంగా మహిళలు తమ రోజువారీ దుస్తులలో భాగంగా తరచుగా హై హీల్స్ ధరిస్తారు. ఈ హీల్స్‌ పెడల్స్ నుండి జారిపోతాయి.

ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం సేఫ్టీ అని చెప్పవచ్చు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు హై హీల్స్ పెడల్స్‌ కింద ఇరుక్కుపోవచ్చు లేదా పెడల్స్ నుంచి జారిపోవచ్చు. దీనివల్ల డ్రైవర్ నుంచి ప్రతిచర్యలు ఆలస్యంగా అందుతాయి. అత్యవసర పరిస్థితులలో ఈ ఆలస్యం కాస్త పెను ప్రమాదానికి దారితీయవచ్చు. ఈ అసౌకర్యం డ్రైవర్ల దృష్టిని మరల్చుతుంది. ఇలాంటి నిమయాలు ఉండటం వల్ల వారు రహదారిపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.

No-High-Heel-Driving

ఫ్లాట్ బూట్లు లేదా మరింత ఇతర సాధారణ చెప్పులు ధరించడం ద్వారా, డ్రైవర్లు ఏకాగ్రత కాళ్లపై ఉండదు. అంతే కాకుండా ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీనివల్ల యాక్సిడెంట్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఈ నిబంధన అమలు సవాలుతో కూడుకున్నది. ట్రాఫిక్ పోలీసులు ఎల్లప్పుడూ ప్రతి డ్రైవర్ పాదరక్షలను తనిఖీ చేయలేరు. అయితే అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కేంద్రాల ద్వారా డ్రైవర్లకు పాదరక్షల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఈ నిబంధనకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది డ్రైవర్లు భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్న ఈ చట్టాన్ని అభినందిస్తున్నారు. ముఖ్యంగా వృత్తిపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల తరచుగా హై హీల్స్ ధరించే వారు ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో రహదారి భద్రతను మెరుగుపరచడానికి వివిధ కార్యక్రమాలలో భాగంగా ఈ నియమం ఉంది. కాబట్టి డ్రైవర్లు వీటిని పాటించడం ఉత్తమం.

ఇలాంటి నిబంధనలను అమలు చేయడంలో భారత్ ఒక్కటే కాదు.. అనేక ఇతర దేశాలు షూస్ డ్రైవింగ్‌కి సంబంధించి ఇలాంటి చట్టాలు లేదా మార్గదర్శకాలను జారీ చేస్తున్నాయి. స్పెయిన్‌లో పాదరక్షల నియంత్రణకు సంబంధించి ఇలాంటి చట్టం ఉంది. ఉదాహరణకు, ప్రభుత్వ డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ ధరించకుండా ఉండాలని సూచించారు. అంతర్జాతీయంగా కూడా వాహనదారులు ధరించే బూట్లపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను ఇలాంటి నిబంధనలు తెలియజేస్తున్నాయి.

ఈ ప్రత్యేకమైన నియమం రహదారి భద్రత పట్ల భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్ధం పడుతోంది. బూట్లు వంటి చిన్న చిన్న అంశాలను కూడా హైలైట్ చేయడం ద్వారా రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అనేక ప్రమాదాలు తప్పాయి. కొంతమంది "డ్రైవింగ్ చేసేటప్పుడు హీల్స్ ధరించకూడదు" చట్టాన్ని అసౌకర్యంగా ఉన్నప్పటికీ దాని ఉద్దేశ్యం మాత్రం స్పష్టంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2024, 9:10 [IST]
English summary
No high heels while driving in india this rule reduce chances of accidents
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+