ఎంత ఖరీదైన కారుకైన ఇండియాలో ఇది తప్పని సరి గురూ.. మీరు కూడా చేసే ఉంటారు
ఈ ఆధునిక కాలంలో కూడా ప్రపంచంలోని చాలా దేశాలు సనాతన భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలను గౌరవిస్తారు. కాబట్టి ఏదైనా ఒక పని చేసే ముందు పూజ చేసి ఆ పని ప్రారంభించడం మన ఆనవాయితీ, కాబట్టి మన దేశంలో ఈ రోజుకి కూడా ఒక సైకిల్ కొన్నా, లేదా ఒక ఖరీదైన లగ్జరీ కారు కొన్నా గానీ దానికి తప్పకుండా పూజ చేస్తారు. ఇటీవల బెంగళూరులో ఒక ఖరీదైన కారుకి పూజ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నివేదికల ప్రకారం, బెంగళూరులో ఒక వ్యక్తి తాను కొనుగోలు చేసిన 'లంబోర్ఘిని' (Lamborghini) కారుని పూజారి చేత పూజ చేయించి ఒక పూల దండ కూడా వేయించాడు. ఈ వీడియోలో ఆ పూజారి కారుకి పూజ చేసి హారతి ఇవ్వడం కూడా చూడవచ్చు. పూజ పూర్తయిన తరువాత ఆ కొనుగోలుదారుడు కారుని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళతాడు.

నిజానికి మనకు వీధిలో కనిపించే కారు లంబోర్ఘిని కంపెనీకి చెందిన 'హురాకాన్' అని తెలుస్తుంది. హురాకాన్ కారు 2013 లో గల్లార్డోకు బదులుగా మార్కెట్లో ప్రవేశించింది. ఆ తరువాత 2020 లో కంపెనీ హురాకాన్ EVO ని తీసుకురావడం జరిగింది. ఇది కంపెనీ యొక్క అప్డేటెడ్ మోడల్. ఇది ఇప్పటికే విక్రయించబడుతున్న ఉరుస్ కంటే ముందు అత్యధిక అమ్మకాలు పొందిన కంపెనీ కారుగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ వీడియోలో కనిపించే హురాకాన్ అనేది AWD వేరియంట్. లాంబోర్గినీ హురాకాన్ AWD ధర బెంగళూరులో దాదాపు రూ. 4.5 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే ఆన్-రోడ్ ధర ఏకంగా రూ. 4.8 కోట్లు. ఇది కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన కారు. వాస్తవానికి హురాకాన్ EVO ధర భారతదేశంలో రూ. 3.63 కోట్ల నుండి మొదలవుతుంది.

భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో చాలామంది సెలబ్రెటీలు లంబోర్ఘిని హురాకాన్ కార్లను కొనుగోలు చేశారు. కావున భారతీయ రోడ్లమీద ఇవి కనిపిస్తూనే ఉంటాయి. అయితే భారతదేశంలో ఈ కార్లకు అనుకూలమైన రోడ్లు లేకపోవడం వల్ల, ఎక్కువమంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

అంతేకాకుండా, లంబోర్ఘిని హురాకాన్ కార్బన్ ఫైబర్ మరియు అల్యూమినియంతో తయారు చేయబడి చాలా తేలికగా ఉంటుంది. అయితే ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. డిజైన్ కానీ, ఫీచర్స్ కానీ ఇందులో చాలా అద్భుతంగా ఉంటాయి.

ఇందులో 5.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 640 పిఎస్ పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు వెళుతుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 325 కిమీ వరకు ఉంటుంది. ఇందులో మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
లంబోర్ఘిని కంపెనీ యొక్క ఉరస్ ప్రస్తుతం ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కారు. ఎందుకంటే దీనికి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల భారతీయ రోడ్ల మీద ప్రయాణించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కరణ్ జోహార్, కార్తీక్ ఆర్యన్ మొదలైన వారు కూడా లంబోర్ఘిని కార్లను కలిగి ఉన్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో సూపర్ కార్ల వినియోగం రోజురోజుకి ఎక్కువవుతోంది. దీనికి కారణం ఎక్కువమంది సూపర్ కారును వినియోగించడానికి ఆసక్తి చూపడమే. అయితే ఎంత ఖరీదైన కారుకైన మనదేశంలో వాహన పూజ తప్పని సరి. ఇందులో భాగంగానే కొత్త లంబోర్ఘిని కారు కోన్ కొనుగోలుదారుడు పూజ చేయించారు. ఇలాంటి ఆసక్తికరమైన కథనాలతో పాటు, కోట్ కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








