టోల్ గేట్ల వద్ద ఫీజు వసూలు రద్దు.. వారికి మాత్రమే ఫ్రీ! నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
టోల్ ఫీజు చెల్లించేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకున్న కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో ఈ సిస్టమ్‌ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుంది. అందులో భాగంగా టోల్ బూత్‌ల వద్ద షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాన్ని ఉచితంగా అందించనుంది. ఈ సదుపాయాన్ని పొందాలంటే కస్టమర్లు కచ్చితంగా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ని అమర్చుకోవాలని ఒక షరతుని విధించింది. ప్రస్తుత ఫాస్టాగ్ వ్యవస్థ స్థానంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (GNSS) వ్యవస్థను తీసుకొచ్చేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. అందులో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఓ కొత్త నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఫంక్షనల్ GNSS అమర్చిన ప్రైవేట్ వాహనాలు జాతీయ రహదారులపై ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. నేషనల్ హైవేస్ టోల్ (ఫీజు) సవరణ నిబంధనలు, 2024 గా పిలువబడే ఈ కొత్త నియమాల ప్రకారం కారు లేదా ఏదైనా వాహనం 20 కిలోమీటర్ల దూరాన్ని మించినప్పుడే టోల్ ఫీజు వర్తిస్తుంది.

ఇందుకోసం నేషనల్ హైవే టోల్ (రేట్ల నిర్ధారణ మరియు వసూలు) నిబంధనలు, 2008 గెజిట్‌ని సవరించింది. కావున జాతీయ రహదారులో ఉండే వంతెనలు, అండర్‌పాస్‌ల వద్ద ఎటువంటి ఛార్జ్ వసూలు చేయరు. కేవలం మీరు ప్రయాణించిన దూరానికి మాత్రమే ఫీజు వసూలు చేస్తారు. కావున హైవేలకు దగ్గర్లోని ప్రాంతాల వారికి ఈ మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది.
జీఎన్ఎస్ఎస్ ద్వారా కేవలం ప్రయాణించిన దూరానికి ఛార్జీలు వసూలు చేసేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పదేపదే నొక్కి చెబుతున్నారు. అందులో భాగంగా ఇటీవల కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూరు రోడ్, హర్యానాలోని ఎన్‌హెచ్-709లోని పానిపట్-హిసార్ రోడ్లలో ఈ జీఎన్ఎస్ఎస్ ఆధారిత యూజర్ ఫీజు వసూలు వ్యవస్థ కోసం టెస్ట్ ట్రయల్ నిర్వహించామని ఆయన తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్, టోల్ ప్లాజాలను తొలగించేందుకు జీఎన్ఎస్ఎస్ టెక్నాలజీని తీసుకువస్తున్నారు.

జీఎన్ఎస్ఎస్-ఎనేబుల్డ్ ట్యాగ్స్ వాహనాల ప్లేసింగ్, వాటి కచ్చితమైన వేగం తదితర డేటాను దీని ద్వారా అంచనా వేస్తారు. కావున కచ్చితమైన సమాచారంతో కేవలం ప్రయాణించిన దూరం, వేగం ఆధారంగా ఛార్జీలను లెక్కిస్తుంది. జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ పాయింట్ల నుంచి ఆ వాహనాలు వెళ్లగానే టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ప్రస్తుత ఫాస్టాగ్ వ్యవస్థ మాదిరిగా కాకుండా, స్కానింగ్ కోసం వాహనాలు నెమ్మదిగా లేదా ఆపాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ఫ్రేమ్ వర్క్‌లో హైబ్రిడ్ మోడల్‌ని ఉపయోగించి జీఎన్ఎస్ఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ ఫేర్ కలెక్షన్ (ఈటీసీ)ను అమలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యోచిస్తోంది. RFID ఆధారిత ఈటీసీ, జీఎన్ఎస్ఎస్ ఆధారిత ఈటీసీ రెండూ ఒకేసారి పనిచేస్తాయి. టోల్ ప్లాజాల వద్ద జీఎన్ఎస్ఎస్ లేన్లు ఉంటాయి. వాహనాలు ఆ లైన్లలో ఆగకుండా వెళ్ళవచ్చు. ఆ తర్వాత అన్ని లేన్లను జీఎన్ఎస్ఎస్ లేన్లుగా మారుస్తారు.

దీని ముఖ్య ఉద్దేశ్యం పేమెంట్ కౌంటర్లలో నగదు లావాదేవీలను తొలగించడం ద్వారా టోల్‌ప్లాజాల వద్ద ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి త్వరగా వెళ్లిపోవచ్చు. ఈ సిస్టమ్ అమలు ద్వారా భారతదేశంలో టోల్ ప్లాజాల్లో ఈ మార్పు త్వరలోనే అమల్లోకి రానుంది. హైవే టోల్ ప్లాజా సమీపంలో నివసిస్తున్న ప్రజలు టోల్ ప్లాజాను ఉపయోగించడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని ఫిర్యాదులకు సైతం ఇకపై చెక్ పడనుంది.


Click it and Unblock the Notifications








