కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారతదేశంలో ఈ వైరస్ మరింత ఉదృతంగా ఉంది. ఈ కారణంగా ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు, మరియు లెక్కకు మించిన ప్రజలు ఈ మహమ్మరి బారినపడుతున్నారు. ఈ తరుణంలో అంబులెన్సులకు మరియు మెడికల్ క్యాబ్‌లకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. కావున సామాన్య ప్రజల వద్ద నుంచి అంబులెన్స్ మరియు మెడికల్ క్యాబ్‌ డ్రైవర్స్ ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి.

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

భారతదేశంలో కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నోయిడా ఒకటి. నోయిడాలో కరోనా సంక్రమణ చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితితో అంబులెన్స్, మెడికల్ క్యాబ్‌ డ్రైవర్లు ఏ మాత్రం కనికరం లేకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు.

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

నివేదికల ప్రకారం వెలువడిన ఒక సంఘటన ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో మూడు కిలోమీటర్లు వెళ్లడానికి ఒక అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా 10,000 రూపాయలు వసూలు చేసాడు. దీనికి సంబంధించిన రశీదు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

MOST READ:సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్‌లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

ఈ సమయంలో కరోనా బాధిత కుటుంబాలకి ఉపశమనం కలిగించడానికి నోయిడా పోలీసులు ఒక చర్య తీసుకున్నారు. నోయిడా పోలీసుల చర్య వల్ల, ఇప్పుడు రోగులు మరియు మృతదేహాలను తీసుకెళ్లడానికి సరైన ధర నిర్ణయించాలని తెలిపారు. దీని వల్ల ఇప్ప్డుడ్ రోగులు కనీస రేటుకే అంబులెన్సులను పొందుతున్నారు.

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ అలోక్ సింగ్ రోగులకు మరియు వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి నోయిడా ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక విధిని అప్పగించారు. దీని ప్రకారం, కొవిడ్ ఆసుపత్రుల సమీపంలో కొంతమంది ట్రాఫిక్ పోలీసుల విధిగా ఉండాలి. ఇది మాత్రమే కాకుండా 9971-009001 అనే హెల్ప్‌లైన్ నంబర్ కూడా జారీ చేయబడింది. పిర్యాదులు చేయవా;రాసిన వారు ఈ నెంబర్ కి పిర్యాదు చేయవచ్చు.

MOST READ:కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజెన్ కూడా ఉంది!

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

ఇప్పుడు ఏదైనా అంబులెన్స్ వ్యక్తి మీ నుండి ఎక్కువ ఛార్జీలు అడుగుతుంటే, ఆసుపత్రి వెలుపల ఉన్న నోయిడా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. పోలీసులు అందుబాటులో లేని సమయంలో ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు.

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

ఒక రోగిని ఇంటి నుండి హాస్పిటల్ కి లేదా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లాలన్నా, లేకుంటే ఒక మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి స్మశానానికి తీసుకెళ్లడానికి వాహన డ్రైవర్లు ఒక రీజనబుల్ అమౌంట్ తీసుకోవాలని పోలీసులు తెలిపారు. ఇలా కాకుండా ఇష్టమొచ్చినట్లు డబ్బు వసూలు చేస్తే తప్పకుండా అటువంటివారిపై చర్య తీసుకోబడుతుంది ప్రకటించారు.

MOST READ:కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

గత కొద్ది రోజులుగా అంబులెన్స్ డ్రైవర్లు రోగుల నుండి ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. అటువంటి పరిస్థితిలో, రోగులలో గందరగోళ వాతావరణం నెలకొంది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, రోగులు సమయానికి ఆసుపత్రికి చేరుకోవడం కూడా కష్టమవుతోంది.

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

ఇటువంటి వాటినన్నింటికీ కట్టిపెట్టడానికి నోయిడా పోలీసులు అడుగులు ముందుకు వేస్తున్నారు. దీని కోసమే నోయిడా పోలీసులు హాస్పిటల్స్ వద్ద ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోబడతాయి.

MOST READ:కరోనా కాటుకు బలైపోయిన మహిళను బైక్‌పై తరలించిన హృదయ విషాద గాథ.. ఎక్కడంటే?

కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

ఇటీవల బెంగళూరులో కూడా ఇటుఅన్తి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళా తండ్రి యొక్క మృతదేహాన్ని స్మశానానికి తరలించడానికి ఏకంగా 60,000 రూపాయలు డిమాండ్ చేశారు. తరువాత దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Most Read Articles

English summary
Noida Police Issues Helpline Number To Check Overpricing By Ambulance Drivers. Read in Telugu.
Story first published: Wednesday, April 28, 2021, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X