ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘిస్తున్నారా.. ఇకపై ఇలా దొరికారా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ క్యాన్సిల్.!!

ఇకపై ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే చలాన్లు విధించడం కాదు ఏకంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌నే రద్దు చేయనున్నారు. ఇప్పటివరకూ చలాన్లతో సరిపెట్టిన ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై.. ఈ ట్రాఫిక్‌ రూల్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు. ఇంతకీ ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనా.. లేదంటే ఇతర రాష్ట్రంలోనా.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

రోజురోజుకీ ట్రాఫిక్‌ ఉల్లంఘనల కేసులు ఎక్కువవుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ట్రాఫిక్‌ పోలీసు అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నోయిడా, గ్రేటర్‌ నోయిడాలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. తద్వారా వాహన యజమానులు, డ్రైవర్లు ట్రాఫిక్‌ రూల్స్‌ను సక్రమంగా పాటించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

Traffic-Violations-Driving-License

గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌లో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు(Traffic Violations) పాల్పడే వాహనదారులు, డ్రైవర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం ఇప్పటికే ప్రారంభించడంతో నోయిడా, గ్రేటర్‌ నోయిడాలో కూడా ఇకపై రూల్స్‌ను పటిష్ఠంగా అమలు చేయనున్నారు. అయితే ఇది అందరికీ వర్తించదు.. దీనికి కొన్ని సడలింపులు ఉన్నాయి అవేంటంటే..

పెరుగుతున్న టెక్నాలజీ, డిజిటల్‌ విధానం ద్వారా.. ఇప్పుడు ట్రాఫిక్‌ చలాన్లను నేరుగా ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. దీంతో ఏ వాహనంపై ఎన్ని చలాన్లు ఏ రకమైన చలాన్లు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. ఈ క్రమంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు ఉన్న వాహనదారులు మళ్లీ ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే నోయిడా పోలీసులు సదరు వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తారు.

Traffic-Violations-Driving-License

నోయిడా, గ్రోటర్‌ నోయిడాలో ఇటీవల తరచూ ట్రాఫిక్‌ ఉల్లంఘనల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గౌతమ్‌ బుద్ధ నగర్‌లో చాలా వరకూ టూ వీలర్లు హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, సిగ్నల్ జంప్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌ లాంటి వాటికి వాహనదారులు, డ్రైవర్లు పాల్పడుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా ఇటీవల యూపీలో ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ITMS) ను అమలు చేసిన మొదటి నగరంగా నోయిడా నిలిచింది. జంక్షన్లు, ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ సిస్టమ్‌లోని హై డెఫినిషన్‌ కెమెరాలను అమరుస్తారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించడంలో ITMS పోలీసులకు సహాయపడుతుంది. ఇది పూర్తిగా డిజిటల్‌ ఆధారితం..

Traffic-Violations-Driving-License

ఈ నేపథ్యంలో నోయిడా పోలీసులు తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా మూడు లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు ఉన్న టూ వీలర్‌, ఇతర వాహనదారుల డ్రైవర్ల డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అధికారికంగా రద్దు చేస్తారు. 'రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా మరియు ఉత్తరప్రదేశ్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం.

ఈ నిర్ణయం మేరకు వరుసగా మూడు చలాన్ల కంటే ఎక్కువ చలాన్లు నమోదైన వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయడానికి చర్య తీసుకోబడుతుంది. రెడ్‌ లైట్‌ జంపింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, ఓవర్‌ లోడింగ్‌, గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లడం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగించడం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తదితర సందర్భాల్లో ఈ రూల్‌ వర్తిస్తుంది.' అని నోయిడా పోలీసులు తెలిపారు.

పదే పదే ఈ తరహా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు రద్దు కూడా చేస్తామని నోయిడా పోలీసులు హెచ్చరించారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు నోయిడాలో ఏకంగా 14 లక్షలకు పైగా చలాన్లను జారీ చేశారు పోలీసులు. గతేడాది కంటే ఇది రెండింతలు ఎక్కువ. వీటిలో 70 వేలకు ఓవర్‌ స్పీడ్‌తో వాహనాలకు విధించిన చలాన్లు ఉన్నాయి.

Traffic-Violations-Driving-License

పెరుగుతున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలు వాటి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలు కారణంగా నోయిడా పోలీసులు ఈ కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకూ నోయిడా మరియు గ్రేటర్‌ నోయిడాలో సుమారు 1000 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 11, 2023, 14:14 [IST]
English summary
Noida police to cancel driving license if caught violating traffic rules
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+