హీరోయిన్‌లా పోజులిచ్చి, పోలీసులకు అడ్డంగా బుక్కైపోయింది.. ఇది చూడండి
సోషల్ మీడియావైలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎంత పనైనా చేసేస్తున్నారు. అయితే కొన్ని సార్లు వారి చేసే పనులే వారిని ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయి. ఇలాంటి వాటికి సంబంధించిన చాలా సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడుద్ తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం ఒక అమ్మాయి మహీంద్రా స్కార్పియో యొక్క బోనెట్ పైన కూర్చుని హీరోయిన్ మాదిరిగా పోజులివ్వాలనుకుని. అయితే పోలీసులకు అడ్డంగా బుక్కైపోయింది. అంతే కాకుండా ఆ కారుని (మహీంద్రా స్కార్పియో) కూడా పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సంఘటన నోయిడాలో జరిగినట్లు తెలుస్తోంది. నోయిడాలో ఎప్పుడూ బిజీగా ఉండే పబ్లిక్ రోడ్డుమీద ఒక యువతి కారు బోనెట్ పైన స్టైల్ గా కూర్చుంది. ఆ కారుని బహుశా ఆమె స్నేహితులు డ్రైవ్ చేస్తున్నారని తెలుస్తోంది. పబ్లిక్ రోడ్డు మీద ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం చాలా ప్రమాదాకరం. ఒక వేళా కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సడన్ గా బ్రేక్ వేస్తే అప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో మనమే ఊహించవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కారు యొక్క నెంబర్ సహాయంతో పోలీసులు మహీంద్రా స్కార్పియో కారు బోనెట్ మీద కోరుచున్న యువతిని, దీనిని ప్రోత్సహించిన ఆమె స్నేహితులపైన కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఆ కారుని కూడా సీజ్ చేశారు.
नोएडा में स्कॉर्पियो की बोनट पर बैठ कर स्टंट दिखा रही युवती का वीडियो वायरल हुआ है। वायरल वीडियो पर पुलिस ने एक्शन लेते हुए कार को जब्त कर लिया है।#Noida #Scorpio #viralvideo pic.twitter.com/foeWjfhiMo
— Akash Savita (AkashSa57363793) November 9, 2022
ఈ సంఘటన నోయిడా ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది కానీ ఎప్పుడు జరిగింది అనేదాని గురించి మాత్రం సరైన ఆధారాలు లేదు. అంతే కాకుండా ఆ యువతిపైన ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు అనేదానికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు వెల్లడించలేదు. అయితే పబ్లిక్ రోడ్డు మీద ఇలాంటి స్టంట్స్ చేయడం మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరం.
ఇక మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో అద్భుతమైన ఆదరణ పొందుతున్న కారు. ఇది అద్భుతమైన డిజైన్, అధునాతన పరికరాలతో మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇటీవల మహీంద్రా స్కార్పియో ఎన్ అనే కొత్త మోడల్ కూడా విడుదలైంది. ఇది అతి తక్కువ కాలంలోనే అత్యధిక బుకింగ్స్ పొందగలిగింది.

ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. కావున భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేస్తున్నారు.

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే పోలీసులు వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. ఇటీవల బెంగళూరు నగరంలో ఒక పోలీస్ హాఫ్ హెల్మెట్ ధరించడాన్ని ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వసూలు చేశారు. ఈ సంఘటన గత కొన్ని రోజులకు ముందు జరిగింది.

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు. ఒక వేళా యువత బైక్ స్టంట్స్ లేదా కారు స్టంట్స్ వంటివి చేయాలనుకున్నప్పుడు తప్పకుండా రేస్ ట్రాక్ లు మరియు ఫామ్హౌస్ లు వంటి ప్రైవేట్ ప్రాపర్టీలో మాత్రమే చేసుకోవాలి. పబ్లిక్ రోడ్లమీద ఇలాంటి స్టంట్స్ చేస్తే అది స్టంట్స్ చేసేవారికి మాత్రమే కాదు, ఇతర వాహన దారులకు కూడా అది ప్రమాదాన్ని తీసుకువస్తుంది.

రోడ్డు ప్రమాదాలు జరగటానికి చాలా కారణాలే ఉన్నాయి, ఇందులో రాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు ఇతరత్రా కారణాలు ముఖ్యమైనవి. రోడ్డుపైన రాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కావున వాహన రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి వాహన వినియోగదారులు కూడా తప్పకుండా సహకరించాలి. అప్పుడే ఇది సాధ్యమౌతుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒకప్పటినుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము, అయితే ఇవి వాహన వినియోగదారులను ఏ మాత్రం చలింపనివ్వడం లేదు, మళ్ళీ మళ్ళీ జరిగిన సంఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. కావున పోలీసులు ఇలాంటి సంఘటనలపైన మరింత కఠినమైన చర్యలను తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే వాహన వినియోగదారులకు తెలిసి వస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతోపాటు, ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








