Video Viral ఇన్‌స్టా రీల్స్‌ కోసం ఏకంగా రోడ్డుపై ట్రాఫిక్‌ను బ్లాక్‌ చేశారు.. కొద్దిసేపటికే..!

సోషల్‌ మీడియో పోస్టులు, రీల్స్‌ కోసం కొంత మంది యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. రాత్రి పగలు సంబంధం లేకుండా రీల్స్‌ కోసం విన్యాసాలు చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియా పట్ల యువతలో ఉన్న ఈ క్రేజే కొన్నిసార్లు వారిని ఇబ్బందులు పెడుతోంది. మరియు పోలీసులకు కూడా సవాళ్లు విసురుతోంది.

ఇప్పటికే చాలా మంది యువతీ యువకులు రీల్స్‌ కోసం పబ్లిక్‌ రోడ్లపై విన్యాసాలు చేయడం అందులో కొ‌న్నిసార్లు ప్రమాదాల బారిన పడడం గురించి వినే ఉంటారు. అహ్మదాబాద్‌లో స్కూటర్‌పై నిల్చొని రీల్స్‌ చేసిన యువకుడిని పోలీసులు అప్పట్లో అరెస్ట్‌ చేశారు. అలాగే హెల్మెట్‌ లేకుండా స్కూటర్‌ నడిపిన పెళ్లి కుమార్తెకు పోలీసులు జరిమానా విధించారు. ఇటువంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.

Noida youth blocks traffic to capture reels

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కొత్త మంది యువకులు రీల్స్‌ చేసేందుకు ఏకంగా రోడ్డునే బ్లాక్‌ చేశారు. సెక్టార్‌ 52లోని అండర్‌పాస్‌ వద్ద ఈ ఘటన జరిగింది. టయోటా ఫార్చ్యునర్‌, మారుతి సుజుకి స్విఫ్ట్‌, మారుతి సుజుకి బాలెనో, హ్యూందాయ్‌ క్రెటా కార్లతో అండర్‌పాస్‌ను బ్లాక్‌ చేసి, రీల్స్‌ చేశారు.

అయితే వీరి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అక్కడకు సమీపంలో ఉన్న కొందరు వాహనదారులు ఈ వీడియోను రికార్డు చేసి ట్విట్టర్‌ ద్వారా నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రీల్స్‌ చేసేందుకు అండర్‌పాస్‌ను బ్లాక్‌ చేసిన యువకులపై చర్యలు తీసుకున్నారు. వారికి రూ.12,500 జరిమానా విధించారు.

Noida youth blocks traffic to capture reels

ఈ ఘటనకు సంబంధించిన యువకులపై చర్యలు తీసుకున్నట్లు నోయిడా పోలీసులు ట్విట్టర్‌ పోస్టు ద్వారా తెలిపారు. చలాన్‌ను షేర్‌ చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారి వివరాలను తమకు తెలియజేయాలని కోరుతూ వారి హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు.

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సంపాదించేందుకు కొంత మంది యువకులు ఇటువంటి విన్యాసాలు చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు అలాంటి విన్యాసాల వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని మర్చిపోతున్నారు. మరియు ఇతరులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. పోలీసులకు చేతికి చిక్కిపోతున్నారు.

పబ్లిక్‌ రోడ్లపై రేసింగ్‌, రీల్స్ కోసం విన్యాసాలు చేయడం, ఇతర ప్రయాణికులను అవస్థలు పెట్టిన ఘటనలను పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. సంబంధిత చట్టాల ద్వారా వెంటనే శిక్షలు, జరిమానాను విధిస్తున్నారు. ఇతర పోలీసు విభాగాల ద్వారా యువతలో అవగాహన కల్పిస్తున్నారు.

యువత కూడా ఇలాంటి రీల్స్‌, రేసింగ్‌ల కోసం ఖాళీ మైదానాలు, మూసి ఉన్న రోడ్లను ఎంచుకోవాలి. పబ్లిక్‌ రోడ్లపై ఇటువంటి విన్యాసాలు చేసినప్పుడు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారనే విషయాన్ని మర్చిపోకూడదు. రోడ్లపై ఇటువంటి కారణాల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయితే అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రజలు, అంబులెన్స్‌లకు ఇబ్బంది ఎదురుకావచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్‌మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 8, 2023, 17:32 [IST]
English summary
Noida youth blocks traffic on underpass to capture reels for instagram police impose fine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+