రైల్వే ప్రయాణికుల భద్రతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. లోకోపైలట్ కళ్ల కదలికలపై నిఘా..?
ప్రయాణికుల భద్రత కోసం నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ కీలక చర్యలు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రయాణ సమయంలో లోకోపైలెట్‌లు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం RDAS- రైల్వే డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటీయర్ రైల్వే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ప్రయాణ సమయంలో తమ లోకోపైలెట్లు అప్రమత్తంగా ఉండేలా చూడడమే RDAS ప్రధాన విధిగా తెలుస్తోంది. లోకోపైలెట్ల కళ్ల కదలికలను పసిగడుతుందని తెలుస్తోంది. డ్రైవర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఈ టెక్నాలజీ వెంటనే అప్రమత్తం చేస్తుందని తెలుస్తోంది.

బ్లింక్ డిటెక్షన్ : RDAS కలిగిన ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆల్గారిథమ్ లోకోపైలెట్ల కళ్ల కదలికలను సైతం గుర్తిస్తుంది. అంటే లోకోపైలెట్లు అజాగ్రత్తగా లేదా నిద్రమత్తులో ఉన్నా గానీ ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది.
హెచ్చరిక వ్యవస్థ : లోకోపైలెట్లు అజాగ్రత్త లేదా చురుకుగా లేనట్లు గుర్తించిన వెంటనే ఈ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. లోకోపైలెట్‌ను అప్రమత్తం చేసేలా హెచ్చరికలు విడుదల చేస్తుంది.
ఎమర్జెన్సీ బ్రేకింగ్: రైలు ప్రయాణంలో లోకోపైలెట్ ఎక్కువ సమయం పాటు అజాగ్రత్తగా లేదా నిద్రమత్తులో ఉన్నట్లు గుర్తిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసిన రైలును నిలుపుదల చేస్తుంది.
విజిలెన్స్ కంట్రోల్ : డివైస్ RDAS టెక్నాలజీ విజిలెన్స్ కంట్రోల్ డివైస్‌తో జతచేయబడుతుంది. ప్రమాదాల జరగకుండా తక్షణమే స్పందిస్తుంది.
ప్రస్తుతం RDAS టెక్నాలజీ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన ఫలితాలు వచ్చిన వెంటనే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు మరికొన్ని వారాలు సమయం పడుతుందని సమాచారం. ప్రస్తుతం 20 గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఇంజిన్‌లలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
రైళ్లలో భద్రత కోసం ఇప్పటికే అనేక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని, మరింత భద్రత కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత RDAS టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పుట్ ఆపరేటెడ్ లివర్ వంటివి డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయని తెలిపారు. ఇవన్నీ విఫలం అయితే RDAS టెక్నాలజీ ఆటోమేటిక్‌గా బ్రేకులను వేస్తుందని తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా రైళ్లలో సౌకర్యాలు, భద్రత కోసం అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత మరింత అప్రమత్తం అయ్యారు. ఒడిశా ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ CBI ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. దీనిపై రైల్వే శాఖ సైతం ప్రాథమిక అంచనాలకు వచ్చింది.
జూన్ 2న బాలాసోర్ వద్ద కోరమాండల్ రైలు ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో కోరమాండల్ రైలు బోగీలు పక్కనున్న ట్రాక్‌పైన పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 296 మంది మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








