ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ రహదారి సొరంగాన్ని నిర్మిస్తున్న నార్వే

Written By:

ఆటోమొబైల్స్ అత్యాధునిక సాంకేతికతలతో అభివృద్ది చెందుతున్న తరుణంలో వాటి ప్రయాణానికి అవసరమైన మార్గాలు కూడా అదే స్థాయిలో అభివృద్ది చెందాల్సి ఉంటుంది. ఇప్పటికే వాయు, జల మరియు భూ మార్గాల ద్వారా రవాణా రంగం కొంత పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు సరికొత్తగా సముద్రం అంతర్బాగంలో తేలియాడే సొరంగాన్ని నిర్మించి అందులో రోడ్లు వేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని మొదటి సారిగా నార్వే నిర్మిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు కోసం క్రింది స్లైడర్లను గమనించండి.

సముద్రం తీరంలో ముక్కలు ముక్కలుగా ఉన్న నార్వే దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నూతన రవాణా మార్గానికి తెరలేపింది. సముద్రం అంతర్బాగంలో ఒక భూ బాగం నుండి మరొక భూ బాగానికి గొట్టాల్లాంటి నిర్మాణాలను చేపట్టి అందులో రహదారిని నిర్మించనున్నారు. ఈ రహదారి పూర్తి స్థాయిలో తేలియాడే విధంగా నిర్మిస్తున్నారు.

తక్కువ సమయంలో ట్రాఫిక్ తక్కువ ఉండే విధంగా అనేక భూ భాగాలను కలుపుతూ పోయే విధంగా నిర్మించి తలపెట్టిన ఈ ఫ్లోటింగ్ రహదారి సొరంగాలను సముద్రం ఉపరితలం నుండి కేవలం 100 అడుగుల లోతులో ఉండేట్లు నిర్మిస్తున్నారు.

అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లో మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫ్లో వంటి వాటికి వినియోగించే పైపుల వంటి ఆకారంలో రెండింటిని సముద్రంలో ఒక దాని వెంబడి మరొకటి ప్రక్కప్రక్కనే అమర్చుతారు.

ప్రతి గొట్టంలో కూడా రెండు లైన్ల రహదారిని నిర్మిస్తారు. తద్వారా ఓవర్ టేకింగ్ మరియు ట్రాఫిక్ నియంత్రణ సులభంగా ఉంటుంది.

రెండు గొట్టాలను ప్రక్కప్రక్కనే ఉండేందుకు నీటి ఉరితలం మీద తేలియాడే పదార్థానికి ఇరువైపులా బల్లకట్టు విధానం ఉపయోగించి (రెండింటిని అడ్డకట్ట ద్వారా అనుసంధానం చేయడం) సముద్రంలోకి కావాల్సిన ప్రదేశాల మధ్య నిర్మించుకుంటారు.

రెండు గొట్టాలను పట్టి ఉంచేందుకు వీటిపైన ఉన్న అడ్డు కట్టలకు మధ్య బోల్ట్ విధానం ద్వారా బిగిస్తారు.

నార్వే అధికారులు మాట్లాడుతూ ప్రయాణికులు సముద్రం గర్బంలో ఉన్న ఈ సొరంగ మార్గాల గుండా ప్రయాణం చేస్తున్నపుడు సాధారణ సొరంగాలలో ప్రయాణం చేస్తున్న అనుభూతిని పొందుతారు.

నార్వే దేశ వ్యాప్తంగా సుమారుగా 1150 సొరంగాలు ఉన్నాయి. అందులో 35 సొరంగాల వరకు నీటిలో ఉన్నాయి.

తేలియాడే సొరంగం రోడ్డు మార్గాలను నిర్మించినప్పటికి దీని ద్వారా కొన్ని నష్టాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నౌకలు మరియు ఓడలు వంటి వాటికి ఇవి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిని నిర్మించే లోతును బట్టి ఈ సమస్యను రూపుమాపవచ్చు.

ఈ ప్రాజెక్ట్ మీద సుమారుగా 25 బిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు ఇప్పటికే నార్వే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం కాన్సెప్ట్ దశల్లో ఉన్న ఈ నమూనాలు కార్యరూపం దాల్చడానికి మరో 19 ఏళ్ల సమయం పట్టనుంది.

  

English summary
Norway engineers propose world first submerged floating road tunnel
Story first published: Thursday, July 28, 2016, 15:19 [IST]
Please Wait while comments are loading...

Latest Photos