మడత పెట్టెయ్.. బ్యాగ్‌లో సర్దెయ్.. సరికొత్త టీపీ స్కూటర్..!

1,000 వాట్ జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ ఇంజన్‌తో లభ్యమయ్యే కారు అత్యంత పోర్టబిల్ వాహనాలలో ఒకటి. దీనిని మడతపెడితే.. 139 సె.మీ. పొడవు, 35 సె.మీ. వెడల్పు, 62 సె.మీ. ఎత్తు ఉంటుంది. అంటే ట్రైన్‌లోని బెర్త్‌కింద కూడా ఇది చక్కగా సరిపోతుందన్నమాట. టాంటే పౌలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబల్ బ్యాటరీ, స్టాండర్డ్ ప్లగ్‌తో లభిస్తుంది. ఫలితంగా.. రైడర్లు పనిలో ఉన్నా లేదా కాఫీ షాప్‌లో ఓ కప్పు కాఫీ తాగుతూ కూడా బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు.
పర్యావరణ సాన్నిహిత్యంగా ఉండమే కాకుండా, ఆర్థిక పరంగానూ ప్రజల జీవనవిధానంలో వారికి సహాయపడేలా ఉండే విధంగా ఈ ఈ స్కూటర్‌ను తయారు చేశామని టీపీ స్కూట్ తయారీదారులు చెబుతున్నారు. టీపీ స్కూటర్ రెండు మోడళ్లలో లభిస్తుంది. మాక్సిమిలన్ II, ఫెర్డినాండ్ II అనే మోడళ్ళలో ఇది లభ్యమవుతోంది. మాక్సిమిలన్ II 1,000 వాట్స్ ఎలక్ట్రిక్ ఇంజన్‌తోనూ, ఫెర్డినాండ్ II 500 వాట్స్ ఎలక్ట్రిక్ ఇంజన్‌తో లభిస్తుంది వీటి ధరలు వరుసగా రూ.1,840 పౌండ్లు (సుమారు రూ.1, 35,000) మరియు రూ. 1,330 పౌండ్లు (సుమారు రూ. 97 వేలు). ఈ స్కూటర్లకి రోడ్ ట్యాక్స్ మినహాయింపు ఉండడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications








