Driving License మీకు గుడ్‌న్యూస్.. ఈ 30 సర్టిఫికేట్లలో ఏ ఒక్కటి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సులభంగా పొందవచ్చు!!!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో చాలావరకు డిజిటల్ సర్టిఫికేట్లను మనం క్షణాల్లో పొందుతున్నాం. ఇందుకోసం ఆయా ప్రభుత్వ సంస్థలు ప్రత్యేకంగా అధికారిక వెబ్/యాప్‌లను రూపొందించాయి. వీటి సాయంతో ఏదైనా సర్టిఫికేట్ కోసమైన అప్లై చేసుకోవడం, అలానే అప్డేట్, డౌన్లోడ్ చేయడం వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం కావాల్సిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే చాలు మీ సర్టిఫికేట‌్‌ను పొందవచ్చు.

ప్రస్తుతం అన్ని ప్రభుత్వ వెబ‌్‌సైట్లలో E-సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం తీసుకువచ్చిన ప్రత్యేక యాప్‌లు (ఉదా..డిజి లాకర్, ఉమాంగ్) వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి అన్ని రకాల సేవలను వినియోగదారులు ఇంట్లోనే ఉండి పొందుతున్నారు. ప్రతి సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో వెరిఫికేషన్ ప్రక్రియలు కూడా సులభంగా జరుగుతున్నాయి.

Driving License

ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఇందుకోసం గుర్తింపు, చిరునామా, వయస్సు వెరిఫికేషన్ కోసం కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా లేదా కొత్త వాహనాన్ని నమోదు చేసుకోవాలన్నా ఆధార్, ఓటర్ ఐడీ కార్డ్ లేదా పాస్‌పోర్ట్‌లలో ఏదైనా ఒకటి కచ్చితంగా ఉండాలి.

అయితే తాజాగా మరిన్ని సర్టిఫికేట్‌లతో మీరు లైసెన్స్‌ని పొందవచ్చు. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ పౌరుల సౌకర్యార్థం వీటిని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో గెజిటెడ్ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ సర్టిఫికెట్లు, కిసాన్ పాస్‌బుక్, రేషన్ కార్డ్‌లు లేదా పీడీఎస్ కార్డు, వికలాంగుల ID కార్డ్‌లు, ప్రభుత్వం జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాలు వంటి పత్రాలను చేర్చాలని అధికారులు యోచిస్తున్నారు.

ఏదైనా సర్టిఫికెట్స్ పొందాలంటే గుర్తింపు, చిరునామా, వయస్సు పత్రాలు తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దాదాపు 30 పత్రాలను అదనంగా చేర్చాలని చూస్తోంది. ప్రభుత్వం నుంచి జారీ చేసిన లింగమార్పిడి ID కార్డులు లేదా ఇతర చిన్న సర్టిఫికేట్‌లు కూడా ఇకపై చెల్లుబాటు అయ్యే పత్రాలుగా పరిగణించబడనున్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ పత్రాలను జత చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి పౌరులకు ఈ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పటివరకు గుర్తింపు, చిరునామా, వయస్సు వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్, ఓటర్ ID, పాస్‌పోర్ట్ అత్యంత ప్రాధాన్య పత్రాలుగా ఉన్నాయి.

driving license dummy

కొత్తగ చేర్చిన ఈ సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ ఒక సంవత్సరానికి మించకుండా ఉండేలా లేదా వాడుకలో ఉంటేనే ఆమోదించబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా గుర్తింపు, వయస్సు రుజువు కోసం 10వ తరగతి మార్కు షీట్ లేదా గుర్తింపు పొందిన బోర్డు జారీ చేసిన ఏదైనా ఇతర సర్టిఫికేట్ ఉంటే సరిపోనుంది. చిరునామా కోసం ఇతర సర్టిఫికేట్లను పరిగణలోకి తీసుకోనున్నారు.

రవాణా మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనలో విదేశీయులకు కూడా సులభంగా లైసెన్సు పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీలు (సిక్కులు, హిందువులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరియు క్రిస్టియన్‌)లకు జారీ చేయబడిన విదేశీ పాస్‌పోర్ట్ ను చిరునామాగా స్వీకరించనున్నారు. వీసా గడువు ముగిసిన విదేశీ దీర్ఘకాలిక వీసాను అంగీకరించనున్నారు.

చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించి సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తీసుకునే ఈ నిర్ణయంతో సులభంగా లైసెన్సు పొందవచ్చని తెలుస్తోంది. గత ఫిబ్రవరిలో, ఢిల్లీలో డ్రైవింగ్ పరీక్షలు త్వరలో పూర్తిగా ఆటోమేటెడ్ అవుతాయని వార్తలు వచ్చాయి. అయితే ఇంకా కార్యరూపం దాల్చలేదు.

మోటారు వాహనాల చట్టం1988, సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీని నియంత్రిస్తుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్ 4 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు తగిన పత్రాల జాబితాను వివరిస్తుంది. ఇందుకోసం కావాల్సిన పత్రాలు సమర్పించి స్లాట్ ప్రకారం డ్రైవింగ్ టెస్ట్ ని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా లైసెన్స్ పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, April 29, 2023, 8:10 [IST]
English summary
Now get driving license and rigistration certificates with 30 more documents
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+