ఎల్లిప్టిగో 3సితో జాగింగ్, సైక్లింగ్ రెండూ ఒకేసారి..!

మరి ఈ టూ ఇన్ వన్ బైక్ చవకగా దొరుకుతుందనకుంటే పొరపాటే. అమెరికా మార్కెట్లో దీని ధర 1,799 డాలర్లు, అంటే మన కరెన్సీలో దాదాపు 80,000 రూపాయలన్నమాట. కాస్తంత వెరటీ, మరింత థ్రిల్ కావాలనుకుంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు మరి. ఇందులో మరో విశిష్టమైన ఫీచర్ ఏంటంటే.. మనుషుల ఎత్తుకు తగినట్లు దీనిని అమర్చుకోవచ్చు. 5 అడుగుల నుంచి 6.8" వరకూ ఈ పరికరాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి మూడు గేర్లు ఉంటాయ. మూడో గేర్‌లో ఇది గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది మూడు రంగు(ఆరెంజ్, గ్రీన్, బ్లాక్)ల్లో లభిస్తుంది. ఈ బైక్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








