ఎలక్ట్రిక్ విమానాల తయారీపై దృష్టి పెట్టిన నాసా.. త్వరలో గాలిలోకి ఎగరనున్న ఎక్స్-57 మ్యాక్స్‌వెల్!
భవిష్యత్తు పూర్తిగా విద్యుత్ శక్తితోనే నడిచేలా కనిపిస్తోంది. ఇప్పటికే టూవీలర్ మరియు ఫోర్-వీలర్ విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా ఉపయోగిస్తుంటే, ఇకపై గాలిలో ఎగిరే విమానాలను కూడా ఎలక్ట్రిక్ పవర్ తో నడిచేలా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఎలక్ట్రిక్ విమానాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తయారు చేసిన నాసా ఎక్స్-57 మాక్స్‌వెల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ (NASAX-57 Maxwell Electric Aircraft) ను ఆవిష్కరించింది. ప్రస్తుతం, దీని అభివృద్ధి దశ పూర్తయింది, మరికొన్ని నెలల్లోనే ఇది పరీక్ష దశకు చేరుకోనుంది.

ఈ పరీక్షల నాసా విజయం సాధిస్తే, ప్రపంచ యావియేషన్ పరిశ్రమలో ఇదొక కొత్త మైలురాయిగా నిలుస్తుంది. నాసా ఎక్స్-57 మాక్స్‌వెల్ టేకాఫ్ కోసం మొత్తం 14 ఎలక్ట్రిక్ మోటార్‌లను ఉపయోగిస్తుంది మరియు కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత క్రూయిజ్ సమయంలో బయట ఉండే రెండు పెద్ద మోటార్లు మాత్రమే ఉపయోగించబడతాయి. అసలు X-57 మాక్స్‌వెల్ అంటే ఏమిటి మరియు భవిష్యత్తులో మనం ప్రయాణించే విధానాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది. ఈ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మరింత లోతుగా పరిశీలిద్దాం రండి.

కొత్త ఎక్స్-57 'మాక్స్‌వెల్' అనేది నాసా నుండి వచ్చిన ప్రయోగాత్మక విమానాల శ్రేణిలో సరికొత్తది, ఇది ప్రజలు ప్రయాణించే విధానాన్ని, ముఖ్యంగా మిలిటరీ ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఈ లైనప్‌లోని మొదటి విమానం బెల్ ఎక్స్-1, ఇది బుల్లెట్ ఆకారంలో ఉండి, రాకెట్ ఇంజన్ తో నడిచేది విమానం. ఇది అక్టోబరు 14, 1947న చక్ యెగేర్ మొట్టమొదటిగా ఎగిరిన విమానం.

ఇదే ఎక్స్ ప్లేన్ లైనప్‌లో కొత్తగా వచ్చినది ఎక్స్-57 'మాక్స్‌వెల్', ఇది NASA యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్, బ్యాటరీ పవర్డ్ విమానం. ఎక్స్-57 ప్రాజెక్ట్ 2016లో ప్రారంభమైంది మరియు విద్యుదయస్కాంత వికిరణం (electromagnetic radiation) యొక్క శాస్త్రీయ సిద్ధాంతాన్ని రూపొందించిన స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ పేరు మీదగా ఈ విమానానికి నాసా ఎక్స్-57 మాక్స్‌వెల్ అనే పేరు పెట్టారు.

ఎక్స్-57 మాక్స్‌వెల్ పూర్తిగా కొత్త విమానం కాదు కానీ ప్రస్తుతం ఉన్న టెక్నామ్ పి2006టి (Tecnam P2006T)ఆధారంగా రూపొందించబడింది, ఇది పూర్తిగా మెటల్ తో తయారైన హై-వింగ్డ్, ఫోర్-సీటర్ ఎయిర్‌ప్లేన్. ఇది రెండు లిక్విడ్-కూల్డ్ రోటాక్స్ ఇంజన్ లను ఉపయోగించి ఏవిగ్యాస్ అలాగే సాధారణ 92-ఆక్టేన్ పెట్రోల్ ఇంధనం ద్వారా పనిచేస్తుంది. ఇప్పటికే ఉన్న ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం ద్వారా, NASA లోని శాస్త్రవేత్తలు ఇందులో ఓ బేస్‌లైన్ మోడల్‌ను ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ తో డిజైన్ చేశారు.
ఎక్స్-57 మాక్స్‌వెల్ ఎలక్ట్రిక్ ప్లేన్ కోసం, నాసా తమ P2006T పెట్రోల్ పవర్డ్ ప్లేన్ యొక్క ఎత్తైన రెక్కలను తీసివేసి, వాటి స్థానంలో ప్రొపెల్లర్‌లను అనుసంధానించారు. ఇందులో మొత్తం 14 ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చిన రెక్కల సెట్ ఉంటుంది. నాసా ఈ వ్యవస్థను శాస్త్రీయంగా లీడింగ్-ఎడ్జ్ అసింక్రోనస్ ప్రొపెల్లర్ టెక్నాలజీ లేదా LEAP అనే పేరుతో పిలుస్తుంది. మాక్స్‌వెల్‌లోని LEAP సిస్టమ్ 12 చిన్న హై-లిఫ్ట్ మోటార్‌లను కలిగి ఉంటుంది, ఇవి రెక్కల అంచున అమర్చబడి ఉంటాయి. అలాగే, మిగిలిన రెండు పెద్ద మోటార్లు రెక్కల చివర్లపై అమర్చబడి ఉంటాయి.

మరి నాసా ఎందుకు ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ అన్ని ప్రొపెల్లర్లను ఉపయోగిస్తోంది? దీని వెనుక ఓ పెద్ద సైన్స్ దాగి ఉంది. విమానపు రెక్కలలో పెద్ద సంఖ్యలో ప్రొపెల్లర్లను ఉపయోగించడం వలన ఎయిర్‌క్రాఫ్ట్ రెక్కలపై గాలిని మరింత వేగంగా నెట్టడంలో ఇవి సహాయపడతాయి, తద్వారా తక్కువ వేగంతో ఎక్కువ లిఫ్ట్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ హై-లిఫ్ట్ మోటార్‌లు ఫ్లెక్సిబుల్ ప్రొపెల్లర్‌లను కలిగి ఉంటాయి, ఇవి ఎక్స్-57 మాక్స్‌వెల్ క్రూజింగ్ వేగాన్ని చేరుకున్న తర్వాత వాటిని పట్టుకునే నాసెల్‌లలోకి ఆపి మడవగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రూజింగ్ వేగాన్ని చేరుకున్న తర్వాత, రెండు పెద్ద వింగ్‌టిప్ ప్రొపెల్లర్లు ఒక్కొక్కటి 60kW మోటారు ద్వారా శక్తిని పొందుతాయి మరియు ప్రయోగాత్మకంగా విమానం గరిష్టంగా 138 మైళ్లు (222 కెఎంపిహెచ్) వేగాన్ని చేరుకోవడంలో ఇవి రెండూ సహాయపడతాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్లకు శని అందించడానికి లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లను ఉపయోగిస్తారు. నాసా ఇందుకోసం కాలిఫోర్నియా-ఆధారిత ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్స్‌తో కలిసి పనిచేసింది, ఇది ఎక్స్-57 కోసం పవర్ సిస్టమ్‌ను రూపొందించడానికి షెల్ఫ్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించింది.

ఇందులోని ప్రతి బ్యాటరీ మాడ్యూల్ లో 320 సెల్‌లను ఉపయోగిస్తుంది మరియు ఈ విమానంలో 16 మాడ్యూల్స్‌తో కూడిన మొత్తం 5,120 సెల్‌లు ఉంటాయి. నాసా ఎక్స్-57 మాక్స్‌వెల్ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ (DEP) సిస్టమ్ సాంప్రదాయ విమానాల కంటే క్లీనర్, గ్రీన్ మరియు చౌకైనది అని NASA పేర్కొంది. ఒక సంప్రదాయ విమానాన్ని నడపడానికి అయ్యే ఖర్చు గంటకు $200 (రూ. 15,541)తో పోలిస్తే DEP వ్యవస్థతో నడిచే విమానం కోసం గంటకు సగటు ఇంధనం కేవలం $35 (రూ. 2,720) మాత్రమే ఖర్చు అవుతుందని నాసా పేర్కొంది.
చిత్ర సౌజన్యం - NASA


Click it and Unblock the Notifications