కెఎస్ఆర్‌టిసి బస్సుల్లో టాయ్‌లెట్, ప్యాంట్రీ సదుపాయాలు
బస్సులో దూర ప్రయాణం చేసేవారిలో దాదాపు చాలా వరకూ బాత్రూమ్ సమస్యలను ఎదుర్కుంటుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్ఆర్‌టిసి) ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది. గడచిన ఏప్రిల్ నెలలో కెఎస్ఆర్‌టిసి లాంగ్ రూట్ వెళ్లే బస్సుల్లో టాయ్‌లెట్లు, వంటగది (కిచెన్) సౌకర్యాలను కల్పించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పుడు తాజాగా మొత్తం ఆరు ఐరావత్ బస్సుల్లో ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కాగా.. ఆరు బస్సుల్లో టాయ్‌లెట్ సౌకర్యం ఉండగా, కేవలం రెండు బస్సుల్లో మాత్రమే ఇన్-హౌస్ ప్యాంట్రీ సర్వీస్‌లు ఉన్నాయి. కేవలం టాయ్‌లెట్ సౌకర్యం కలిగిన మల్టీ-యాక్సిల్ వోల్వో ఐరావత్ బస్సులను 'ఐరావత్ సుపీరియా'ను టాయ్‌లెట్ ప్లస్ కిచెన్ సౌకర్యం కలిగిన బస్సులను 'ఐరావత్ బ్లిస్'గాను పిలువనున్నారు.
ప్రత్యేకించి వయస్సు మళ్లిన వారు, చిన్న పిల్లలతో ప్రయాణం చేసే వారికోసం ఈ టాయ్‌లెట్ సౌకర్యాన్ని ఎర్పాటు చేశామని, టాయ్‌లెట్ల నిర్వహణను కెఎస్ఆర్‌టిసి సిబ్బంది చూసుకుంటారని, ప్యాంట్రీ సేవలను మాత్రం ప్రవేట్ వ్యక్తులు నిర్వహిస్తారని, కెఎస్ఆర్‌టిసి పేర్కొంది. ప్యాంట్రీ సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే, దీనిని అవుట్‌సోర్స్ చేస్తామని, 10 గంటల కన్నా ఎక్కువ ప్రయాణం కలిగిన బస్సుల్లో పూర్తిస్థాయి ఇన్-హౌస్ ప్యాంట్రీ సేవలను అందిస్తామని కెఎస్ఆర్‌టిసి అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఆరు బస్సులు కూడా చెన్నై, తిరుపతి రూట్లలో తిరగనున్నాయి. ఐరావత్ బ్లిస్ బస్సుల్లో ప్రతి సీటు వెనుక ఫిక్స్ చేయబడి ఉన్న స్క్రీన్లపై లైవ్ టెలివిజన్‌ను వీక్షించవచ్చు. అలాగే, ఇందులో ఉండే వై-ఫై ద్వారా జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)ను ట్రాక్ చేసుకోవచ్చు. అయితే, ఈ బస్సుల్లో ప్రయాణ రుసుము ఎంత ఉంటుందనే విషయాన్ని మాత్రం కెఎస్‌ఆర్‌టిసి వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications









