వీల్‌చైర్‌కు పరిమితమైన వాళ్లు కూడా కారు నడపొచ్చు
కారు నడపటాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే, వికలాంగులు కారు నడపటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కానీ, వీల్ చైర్‌కు పరిమితమైన వాళ్ల చేత కూడా మేము నడిపించగలమని చెబుతున్నారు బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్ ఇంజనీర్లు. బ్రిటన్‌కు చెందిన 'కెంగారు' అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ తమ సంస్థ పేరుతోనే వికలాంగుల కోసం ఓ కారును తయారు చేసింది. ఈ కారును ప్రత్యేకించి కాళ్లు లేని వారి కోసం (రెండు కాళ్లు లేకపోయినా సరే) అభివృద్ధి చేసింది.
అనారోగ్యం/ప్రమాదాల బారిన పడి వీల్‌చైర్‌కు పరిమితమై, బయటి ప్రపంచానికి దూరమయ్యే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ కెంగారు కారును తయారు చేయటం జరిగింది. ఈ కారును నడపటానికి కాళ్లతో పనిలేదు. దీని స్టీరింగ్ సైకిల్/బైక్ స్టీరింగ్‌ను పోలి ఉండి, దానిపైనే పూర్తి కంట్రోల్స్ ఉంటాయి. ఇది బ్యాటరీ పవర్‌తో పనిచేస్తుంది. ఈ కెంగారు ఎలక్ట్రిక్ వాహనంలో వీల్‌చైర్ పట్టేంత స్థలం ఉంటుంది. ఇందులోకి నేరుగా వీల్‌చైర్‌తో ప్రవేశించవచ్చు.
కారులో వీల్‌చైర్ కదలకుండా ఉండేందుకు సీట్‌బెల్ట్ లాక్ ఉంటుంది. ఈ కారు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది. ఇది ప్రకృతికి ఎలాంటి హాని కలిగించదు. దీని డోర్ వెనుక వైపుకు తెరుచుకుంటుంది. ఈ డోర్ ద్వారా వీల్‌చైర్‌తో కారు లోనికి/బయటకు ప్రవేశించటం సులువుగా ఉంటుంది. కారులో ఉండే ఇంటర్‌లాకింగ్ డివైజ్ ద్వారా వీల్‌చైర్ సెక్యూర్‌గా ఉంటుంది. కెంగారు తేలిక బరువును కలిగి ఉండటం వలన దీనిని స్కూటర్‌గా వర్గీకరించారు. కాబట్టి ఈ కారును నడపటానికి కేవలం స్కూటర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు

కెంగారు ఎలక్ట్రిక్ కారు



Click it and Unblock the Notifications








