రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

'జూనియర్ ఎన్టీఆర్‌' ఈ పేరుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే తాతకు తగ్గ మనవడిగా, సినీరంగంలో తనదైన రీతిలో ఒక ప్రత్యేకతను కలిగి ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాతో బాల నటుడిగా తెలుగు సినీరంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఒక పాపులర్ సెలబ్రెటీ స్థానంలో నిలిచాడు.

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్‌ కి సినిమాలంటే ఎంత ఇష్టమో, లగ్జరీ కార్లు మరియు బైకులంటే కూడా అంతే ఇష్టం. ఈ సంగతి ఎన్టీఆర్‌ అభిమానులందరికి తెలుసు. ఇంహులో భాగంగానే యితడు ఇటీవల Lamborghini బ్రాండ్ యొక్క కొత్త Urus Graphite Capsule Edition కొనుగోలు చేశారు. ఈని ధర రూ. రూ. 3.15 కోట్లు (ఎక్స్-షోరూమ్).

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

ఇటీవల ఎన్టీఆర్ తన కొత్త Lamborghini Urus Graphite Capsule Edition కి ఒక ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేశారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా 17 లక్షల రూపాయలు. TS 09 FS 9999 అనే నెంబర్ ఇటీవల ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు వేలం వేశారు. ఈ నెంబర్ ను రూ. 17 లక్షలు వెచ్చించి ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్‌ బిడ్‌ అని అధికారులు చెప్తున్నారు.

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

అత్యధిక డబ్బు చెల్లించి తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్స్ కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు చాలామంది లక్షల్లో ఖర్చు చేసి తమకు నచ్చిన నంబర్స్ సొంతం చేసుకున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ రూ. 10 లక్షలు పెట్టి '9999' నెంబర్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నెంబర్ కోసం రూ. 17 లక్షలు ఖర్చు చేశారు.

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

ఎన్టీఆర్ దగ్గర ఉన్న అదుపు అన్ని కార్లకు కూడా 9999 అనే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎంచుకోవడం వెనుక వున్న అసలు విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ కూడా ఈ నెంబర్ వాడినట్లు స్వయంగా ఎన్టీఆర్ తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ కూడా @tarak9999 ఉండటం గమనార్హం.

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

ఎన్టీఆర్ మాత్రమే కాకుండా చాలామంది ప్రముఖులు తమ అన్ని కార్లకు ఒకే నెంబర్ ఉండాలని సెంటిమెంట్ గా తీసుకుంటారు. ఇందులో మలయాళీ స్టార్ మమ్ముట్టి కూడా ఒకరు.

ఎన్టీఆర్ కొనువులు చేసిన కొత్త Lamborghini Urus Graphite Capsule Edition (లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్) విషయానికి వస్తే, ఇది ఇటీవల భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ కొత్త ఎడిషన్ విభిన్న కలర్ షేడ్స్ కలిగి ఉంటుంది. Lamborghini Urus Graphite Capsule Edition లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా హుందాగా ఉంటుంది. ఇది మునుపటికంటే మోడల్స్ కంటే కూడా చాలా కొత్తగా వాహనదారునికి మరింత అనుకూలంగా కూడా ఉంటుంది.

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

Lamborghini Urus Graphite Capsule Edition అత్యాధునిక డిజైన్ కలిగిన వేగవంతమైన ఎస్‌యూవీలలో ఇది ఒకటి. ఇది డ్యూయెల్-టోన్ కలర్ స్కీమ్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రాఫైట్ ఎడిషన్ క్యాబిన్ లోపల డార్క్ యానోడైజ్డ్ అల్యూమినియం మరియు మ్యాట్ ఫినిష్ కార్బన్ ఫైబర్‌తో ట్రిమ్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి. సీట్లు ఆల్కాంటారాలో పూర్తయిన హెక్సాగోనల్ స్టిచ్చింగ్ మరియు లెదర్ ఇన్సర్ట్‌లతో పూర్తయ్యాయి.

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

Capsule Edition యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో హుడ్ కింద అదే 4.0 లీటర్-టర్బోచార్జ్డ్ వి8 యూనిట్ ఉంది. ఇది 641 బిహెచ్‌పి మరియు 850 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త సూపర్ ఎస్‌యూవీ బరువు 2.2 టన్నుల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఈ సూపర్ కారు యొక్క గరిష్ట వేగం 305 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది.

రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?

Jr NTR ఇప్పటికే Porsche (పోర్స్చే) వంటి ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నాడు. రెండు సీట్ల Porsche నడిపిన ఏకైక నటుడు Jr NTR. ఈ కారు ధర ఒక కోటి రూపాయలు. ఈ కారులో 3,436 సిసి ఇంజన్ ఉంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. అంతే కాకుండా ఎన్టీఆర్ Harley Davidson Bike కూడా కలిగి ఉన్నారు.

ఎన్టీఆర్ ఇటీవల ఎవరు మీలో కోటీశ్వరులో హోస్ట్ గా ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఇతడు ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్​' చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు.

Most Read Articles

English summary
Ntr junior cars fancy number9999 bought for rs 17 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X