Just In
- 11 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 14 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రూ. 17 లక్షలకు కార్ నెంబర్ సొంతం చేసుకున్న Jr. NTR: ఆ నెంబర్ ప్రత్యేకత ఏంటి?
'జూనియర్ ఎన్టీఆర్' ఈ పేరుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే తాతకు తగ్గ మనవడిగా, సినీరంగంలో తనదైన రీతిలో ఒక ప్రత్యేకతను కలిగి ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాతో బాల నటుడిగా తెలుగు సినీరంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఒక పాపులర్ సెలబ్రెటీ స్థానంలో నిలిచాడు.
ఇదిలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ కి సినిమాలంటే ఎంత ఇష్టమో, లగ్జరీ కార్లు మరియు బైకులంటే కూడా అంతే ఇష్టం. ఈ సంగతి ఎన్టీఆర్ అభిమానులందరికి తెలుసు. ఇంహులో భాగంగానే యితడు ఇటీవల Lamborghini బ్రాండ్ యొక్క కొత్త Urus Graphite Capsule Edition కొనుగోలు చేశారు. దీని ధర రూ. రూ. 3.15 కోట్లు (ఎక్స్-షోరూమ్).
ఇటీవల ఎన్టీఆర్ తన కొత్త Lamborghini Urus Graphite Capsule Edition కి ఒక ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేశారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా 17 లక్షల రూపాయలు. TS 09 FS 9999 అనే నెంబర్ ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు వేలం వేశారు. ఈ నెంబర్ ను రూ. 17 లక్షలు వెచ్చించి ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్ బిడ్ అని అధికారులు చెప్తున్నారు.
అత్యధిక డబ్బు చెల్లించి తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్స్ కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు చాలామంది లక్షల్లో ఖర్చు చేసి తమకు నచ్చిన నంబర్స్ సొంతం చేసుకున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ రూ. 10 లక్షలు పెట్టి '9999' నెంబర్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నెంబర్ కోసం రూ. 17 లక్షలు ఖర్చు చేశారు.
ఎన్టీఆర్ దగ్గర ఉన్న అదుపు అన్ని కార్లకు కూడా 9999 అనే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎంచుకోవడం వెనుక వున్న అసలు విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ కూడా ఈ నెంబర్ వాడినట్లు స్వయంగా ఎన్టీఆర్ తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ కూడా tarak9999 ఉండటం గమనార్హం.
ఎన్టీఆర్ మాత్రమే కాకుండా చాలామంది ప్రముఖులు తమ అన్ని కార్లకు ఒకే నెంబర్ ఉండాలని సెంటిమెంట్ గా తీసుకుంటారు. ఇందులో మలయాళీ స్టార్ మమ్ముట్టి కూడా ఒకరు.
ఎన్టీఆర్ కొనువులు చేసిన కొత్త Lamborghini Urus Graphite Capsule Edition (లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్) విషయానికి వస్తే, ఇది ఇటీవల భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ కొత్త ఎడిషన్ విభిన్న కలర్ షేడ్స్ కలిగి ఉంటుంది. Lamborghini Urus Graphite Capsule Edition లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా హుందాగా ఉంటుంది. ఇది మునుపటికంటే మోడల్స్ కంటే కూడా చాలా కొత్తగా వాహనదారునికి మరింత అనుకూలంగా కూడా ఉంటుంది.
Lamborghini Urus Graphite Capsule Edition అత్యాధునిక డిజైన్ కలిగిన వేగవంతమైన ఎస్‌యూవీలలో ఇది ఒకటి. ఇది డ్యూయెల్-టోన్ కలర్ స్కీమ్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రాఫైట్ ఎడిషన్ క్యాబిన్ లోపల డార్క్ యానోడైజ్డ్ అల్యూమినియం మరియు మ్యాట్ ఫినిష్ కార్బన్ ఫైబర్‌తో ట్రిమ్ ఇన్సర్ట్లు ఉన్నాయి. సీట్లు ఆల్కాంటారాలో పూర్తయిన హెక్సాగోనల్ స్టిచ్చింగ్ మరియు లెదర్ ఇన్సర్ట్లతో పూర్తయ్యాయి.
Capsule Edition యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో హుడ్ కింద అదే 4.0 లీటర్-టర్బోచార్జ్డ్ వి8 యూనిట్ ఉంది. ఇది 641 బిహెచ్పి మరియు 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త సూపర్ ఎస్యూవీ బరువు 2.2 టన్నుల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఈ సూపర్ కారు యొక్క గరిష్ట వేగం 305 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ ఎస్యూవీ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది.
Jr NTR ఇప్పటికే Porsche (పోర్స్చే) వంటి ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నాడు. రెండు సీట్ల Porsche నడిపిన ఏకైక నటుడు Jr NTR. ఈ కారు ధర ఒక కోటి రూపాయలు. ఈ కారులో 3,436 సిసి ఇంజన్ ఉంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. అంతే కాకుండా ఎన్టీఆర్ Harley Davidson Bike కూడా కలిగి ఉన్నారు.
ఎన్టీఆర్ ఇటీవల ఎవరు మీలో కోటీశ్వరులో హోస్ట్ గా ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఇతడు ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు.