నేటి వీడియో: నర్‌బర్గ్‌రింగ్ రేస్ ట్రాక్‌పై ప్రమాదాలు

By Ravi

మీకు యమలోకంలో ఉండే నరకం గురించి తెలిసే ఉంటుంది, కానీ భూలోకంపై ఉండే 'పచ్చటి నరకం' (గ్రీన్ హెల్) గురించి తెలుసా..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఈ గ్రీన్ హెల్‌ను చూడాలంటే మన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ వరకు వెళ్లిరావాల్సిందే. ఫ్రాంక్‌ఫర్ట్‌కు సమీపంలో ఉన్న ప్రపంచంలోని అతిచెడ్డ రేసింగ్ సర్క్యూట్‌లలో నర్‌బర్గ్‌రింగ్ కూడా ఒకటి.

పేరు వినడానికే విచిత్రంగా ఉన్న ఈ రేసింగ్ సర్క్యూట్‌ను ముద్దుగా 'గ్రీన్ హెల్' అని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రపంచంలోని ఏ ఇతర రేస్ ట్రాక్‌పై జరగని విధంగా ఈ రేస్ ట్రాక్‌పై అత్యధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో రేసర్లు అదృష్టం బాగుంటే బతికి బట్టకడుతారు లేదంటే గ్రీన్ హెల్ నుంచి నేరుగా హెల్‌కి వెళ్తారు.

Nurburgring Circut

నర్‌బర్గ్‌రింగ్ రేస్ ట్రాక్‌పై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజు 1 కన్నా ఎక్కు ప్రమాదాలే జరుగుతుంటాయి. ఇందులో అత్యధిక ప్రమాదాలు చిన్నపాటివి కాగా, ఎక్కువ ప్రమాదాలు సీరియస్‌గా జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల గురించి అధికారిక లెక్కలు నమోదు కానప్పటికీ, ఈ రేస్ ట్రాక్‌పై సుమారు 100 మందికి పైగా రేసర్లు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా.

నర్‌బర్గ్‌రింగ్ రేస్ ట్రాక్ ఇంత ప్రమాదకరంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకుంటే, ఈ రేస్ ట్రాక్ మొత్తం పొడవు 28 కిలోమీటర్లు, అయితే ఇందులో మొత్తం 187 మలుపులు (కార్నర్స్) ఉంటాయి. ఎంతటి నైపుణ్యం కలిగి రేసర్‌కైనా ఒకే రోడ్డుపై ఇన్ని మలుపులను గుర్తుంచుకోటవం కష్టం. అంతేకాదు, ఈ రేస్ ట్రాక్‌పై సరైన రక్షణ వ్యవస్థ కూడా లేదు. అందుకే ఈ ట్రాక్‌పై ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో కొన్నింటిని ఈ క్రింది వీడియోలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/zIltO3NuGkk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2013, 7:49 [IST]
English summary
Nurburgring, the infamous racing circuit near Frankfurt Germany, is also referred to by its other name - The Green Hell. It is called so for a very good reason. Nurburgring or The Ring has claimed more lives than any other race track in the world. Accidents happen here all the time. More than one every day.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+