ఏరియా 51 మరియు దాని రహస్యాలు వెల్లడించనున్న ఒబామా !!
ప్రపంచంలో అత్యంత రహస్యమైన మానవ నిర్మిత ప్రదేశాలలో ఏరియా 51 ఒకటి. పశ్చిమ అమెరికాలో ఉన్న నెవడాకు దగ్గరలో ఏరియా 51 అనేది కలదు. ఇక్కడ యుఎఫ్ఓలు మరియు మిలిటరీ విమానాలకు సంభందించి నిరంతరం ప్రయోగాలు జరుగుతుంటాయి. అందుకోసమే దీనిని అత్యంత రహస్యమైన ప్రదేశంగా ఉంచాల్సి వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది.
ఈ సందర్భంలో అమెరికాలోని ప్రజానికానికి తాను అధికారం నుండి వైదొలిగేలోపు ఎగిరే సాసర్ (యుఎఫ్‍ఓ) మరియు ఏరియా 51 కు చెందిన పూర్తి రహస్యాలను వెల్లడిస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించాడు. ఏరియా 51 మరియు దీనికి చెందిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు క్రింది కథనంలో....

1. రహస్య ప్రాంతం
నెవడా అరిడ్ ల్యాండ్ స్కేప్ ప్రాంతం మొత్తం చూట్టూ ఉన్న ఎత్తైన కొండల మధ్యేలో ఉంటుంది. పశ్చిమ అమెరికాలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏరియా 51 అంటారు. ఇక్కడికి బయటి వ్యక్తులను అనుమతించరు.

2. ఎగిరే ప్లేట్లు
ఎగిరే ప్లేట్లు ఆకారంలో ఉండే వాటిని యుఎఫ్‌ఓలు అని అటాం. వీటిని గుర్తించడానికి వీలు లేకుండా వృత్తాకారంలో ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. 1947 జూలై 7 అమెరికాలోని న్యూ మెక్సికోలో యుఎఫ్‌ఓ ప్రమాదం సంభవించింది అందులో చిధ్రమైన గ్రహాంతర వాసుల శరీర భాగాలను మరియు యుఎఫ్‌ఓ విడిభాగాలను ఈ ఏరియా 51 లో భద్రపరిచినట్లు తెలిసింది.

3. సాయుధ పరీక్షల భూ భాగం
ఈ ప్రదేశంలో 1955 నుండి అమెరికా సాయుధ విమానాల అభివృద్ది మరియు ప్రయోగ కేంద్రాన్ని ఇక్కడ స్థాపించారు. అంతే కాకుండా ఇక్కడ అమెరికా రహస్య ఆయుధాల తయారీను ప్రారంభించారు. అందువలన ఈ ప్రదేశాన్ని ఎక్కువ రక్షిత ప్రాంతంగా ప్రకటించారు.

4. బ్లాక్ ప్రాజెక్ట్
అమెరికా, బి-2 స్పిరిట్ బాంబర్ విమానం, యు2 రహస్య విమానాన్ని బ్లాక్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ ఏరియా 51 లో అభివృద్ది చేసింది.

5. టైం మిషన్
ఏరియా 51 గురించి ప్రపంచ వ్యాప్తంగా విపిస్తున్న వివిధ రకాల వాదనల్లో ఇక్కడ టైమ్ మిషన్ యొక్క సాంకేతికతను కూడా పరీక్షిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. భూత కాలానికి లేదా భవిష్యత్తు కాలానికి వెళ్లి వచ్చే యంత్రాన్ని అభివృద్ది చేస్తున్నట్లు కొన్ని వాదనలు ఉన్నాయి.

6. అమెరికాను లోతుగా పరిశీలిస్తే
అమెరికా యొక్క శత్రు దేశాల నాశనానికి రష్యాతో పాటు ఏరియా 51 లో ివిధ రకాల కుట్రలు చేస్తున్నారు అనేది విమర్శ. ఏరియా 51 లో ఉన్న గ్రూమ్ లేక్ లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తున్నారు.

7. రహస్య ఆయుధాలు
ఇక్కడ చేస్తున్న ప్రయోగాల వలన అత్యంత ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలు బయటపడుతున్నాయి. వాటి వలన భారీ ప్రకంపనలు సృష్టించవచ్చు. అని అమెరికా ఇంటెలిజెన్స్ వారి దర్యాప్తులో తేలింది. ఇవి ఆయుధాల కన్నా ఎంతో శక్తివంతమైనవిగా తేల్చారు.

8. దాగి ఉన్న నిజాలు
ఈ ఏరియా 51 ప్రాంతంలో ప్లేట్లు వంటి ఆకారంలో కొన్ని వస్తువులు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి అని సమాచారం. అయితే ఇవి ఏలియన్స్ యొక్క వస్తువులా లేదా అమెరికా చేస్తున్న రహస్య ప్రయోగాల్లో భాగమేనా అనేది తేలాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు దీనికి సంభందించిన నిజాలను వివరిస్తాను అని చెప్పిన నేపథ్యంలో యావత్ ప్రపంచం ఎంతో ఆతృుతగా ఎదురుచూస్తోంది.

9. హిల్లరీ ప్రతిజ్ఞ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలోని డెమొక్రటిక్ పార్టీకు చెందిన హిల్లరీ తాను పదవిలోకి వస్తే ఏరియా 51 లో యుఎఫ్‌ఓలకు సంభందించి జరుగుతున్న ప్రయోగాల యొక్క మొత్తం రహస్యాలను వెల్లడిస్తానన్ని ప్రతిజ్ఞ చేసింది.

10. ఒబామా నోటి నుండి...
ఏరియా 51 గురించి ఒబామా కూడా వివరాలను వెల్లడించడానికి 2013 లో ప్రయత్నించాడు. కాని దేశం యొక్క భద్రత దృష్ట్యా ఆ విషయాలను వెల్లడించలేకపోయాడు. అయితే హిల్లరీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధ్యక్షుడు ఒబామా కూడా వాటిని త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు.

11. అతి త్వరలో
ఈ మాటల వాగ్వాదాల నేపథ్యంలో అమెరికా ఆధారిత అనలిస్ట్ అయిన స్టీఫెన్ మాట్లాడుతూ, "ఈ ఏడాది అమెరికాలోని ఏరియా 51 లో యుఎఫ్‌ఓలకు సంభందించి జరుగుతున్న ప్రయోగాల గురించి పూర్తి రహస్యాలను అమెరికా అధ్యక్షుడు అతి త్వరలో వెల్లడిస్తాడని" తెలిపాడు

12. నోబెల్ బహుమతి ఖాయం
సుమారుగా 50 సంవత్సరాల పాటు ఈ ఏరియా 51 లో యుఎఫ్‌ఓలకు సంభందించిన ప్రయోగాల్లో ఎంతో పురోగతిని సాధించినట్లు ఉంది. అందుకోసమే కాబోలు ఒబామా స్టీఫెన్‌తో మాట్లాడుతూ ఈ ప్రయోగం గురించి ప్రపంచానికి వివరిస్తే నోబెల్ బహుమతి ఖచ్చితంగా సాధిస్తామని తెలిపాడు.



Click it and Unblock the Notifications








