ఐర్లాండ్ ట్రిప్‌లో ముందుకెళ్లనని మొండికేసిన ఒబామా కారు

Obama Cadillac
అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా కారు ముదుకెళ్లనని మొండికేసింది. ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న ఒబామా అక్కడి అమెరికా దౌత్య కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా గేటు వద్ద ఉన్న చిన్నపాటి ఎత్తును ఎక్కడానికి ఆ కారు మొరాయించింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా యూజర్లు చూశారు. అంతేకాదు 'ఎన్నడూ చూడని బెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ యాడ్', 'దీనికోసం మీరు బిన్ లాడెన్ లాడెన్‌ని బ్లేమ్ చేయలేరు' అంటూ వ్యాఖ్యలు కూడా పోస్ట్ చేశారు.

సరే సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం సర్వసాధారణమైన విషయమే అనుకోండి. ఇక ఒబామా ఉపయోగించే ఈ సూపర్ బాంబ్ ప్రూఫ్ కారు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనం. ధర సుమారు రూ. 1.35 కోట్లు. ఈ కాడిలాక్ కారు ముద్దుపేరు 'ది బీస్ట్'. రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలు పదార్థాలను సైతం ఇది ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారుకు చిన్న గీత కూడా పడదు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వారికి ఇచ్చే అధికారిక వాహనం ఇది.

అత్యవసర పరిస్థితుల్లో ఒక్క బటన్ నొక్కితే అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి. మరీ అత్యవసర పరిస్థితి ఏర్పడి అధ్యక్షుడికి ఏదైనా గాయం/ప్రమాదం సంభవిస్తే అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా ఈ కారులో స్టోర్ చేసి ఉంచుతారు. మూడు టన్నుల బరువు ఉండే ఈ బ్లాక్ కలర్ కాడిలాక్ కారు గంటకు 60 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ)కు చెందిన నిపుణుడైన ఏజెంట్ ఈ కారును డ్రైవ్ చేస్తాడు.

ప్రమాదంలో కారు టైర్లు పేలిపోయినా వాహనం మాత్రం ఆగకుండా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇంకా ఈ కారులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. జస్ట్ ఈ కారు వెనుక సీటులో కూర్చునే ఒబామా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికాను పాలించే వెసులుబాటు ఉంటుంది. లాప్‌టాప్, వైర్‌లెస్ ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఎల్లప్పుడూ అమెరికాలోని వైట్‌హౌస్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 24, 2011, 18:14 [IST]
English summary
US president Barack Obama’s car got stuck at the US Embassy in Ireland as it tried to drive over a small ramp. The car is nicknamed ‘The Beast’ as it was built to withstand all types of attacks.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+