కార్లు, బైక్‌లపై అసభ్యకర, పిచ్చి రాతలు రాస్తే ఇక అంతే సంగతులు.. ఆ సిటీలో రూల్స్ మారాయి!
మనలో చాలామందికి సొంత కారుపై అభిమాన నాయకుల చిత్రాలు, ఇతర టెక్ట్స్‌కి సంబంధించిన స్టిక్కర్స్‌ని లేదా రేడియాన్ని అతికించడం చేస్తూ ఉంటారు. అయితో మరికొంత మంది ఇతరులకు ఇబ్బంది కలిగించే చిత్రాలు, కొటేషన్స్‌ని కారుపై ముద్రిస్తారు. నిత్యం వేలాది కార్లపై ఇలాంటి స్టిక్కర్లు దర్శనమిస్తాయి. కొందరు నంబర్‌ప్లేట్ స్థానంలోనూ వివిధ రకాల కొటేషన్స్, నంబర్స్‌ని తమకు నచ్చిన ఫాంట్‌లో రాస్తుంటారు. అయితే ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ప్రస్తుతం ఆ మెట్రో నగరంలో రూల్స్ మారాయి. ఇలా ఎవరైనా కార్లపై స్టిక్క్లు అతికిస్తే వారికి భారీ జరిమానాతో పాటు, IPC సెక్షన్స్ ప్రకారం శిక్ష పడనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
మీరు కోల్‌కతాలో కారు లేదా ఇతర వాహనాలు నడుపుతున్నారా? అయితే మీ కారుపై ఇష్టం వచ్చినట్లు అభ్యంతరకరమైన, అసభ్యకరమైన సందేశాలతో కూడిన స్టిక్కర్స్ ఉంటే మీకు జరిమానా పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరంలో నివసించే వాహన యజమానులకు కోల్‌కతా పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ (Twitter)లో ఓ హెచ్చరికను జారీ చేశారు.

'అభ్యంతరకరమైన, అశ్లీలమైన, అవమానకరమైన సందేశాలు, పోస్టర్లు లేదా ఫోటోలు' అంటే ఏమిటో అర్థం అయ్యేలా కోల్‌కతా పోలీసులు ఒక ఉదాహరణతో చూపించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద లేదా కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (BNS) కింద చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. చట్టప్రకారం ట్రాఫిక్ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు.
ఓ హ్యుందాయ్ కారు వెనుక విండ్ స్క్రీన్‌పై 'పామునైనా నమ్మండి కానీ అమ్మాయిలను నమ్మకండి' అని రాసి ఉంది. ఇలాంటివి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉంటాయని పరువు నష్టం దావాకు దారితీసే అవకాశం ఉందని సందేశం ద్వారా హెచ్చరించారు. కుల, మత, లింగ భేదాలకు అతీతంగా మనోభావాలను దెబ్బతీసే స్టిక్కర్లతో నగరంలోని పలు వాహనాలు తరచూ తిరుగుతున్నాయని పోలీసు శాఖ తెలిపింది.

ప్రైవేట్ వాహన యజమానులు, బస్సులు మరియు ట్రక్కులు వంటి ప్రజా రవాణా వాహనాల్లోనూ ఇలాంటి స్టిక్కర్లు లేదా సందేశాలను అతికించవద్దని కోల్‌కతా పోలీసులు హెచ్చరించారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్లు 499 మరియు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) 356 (ఐ) కింద పరువు నష్టం కేసును నివారించడానికి హ్యుందాయ్ వాహన యజమానిని స్టిక్కర్ తొలగించాలని కోరినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు.
ఒకరి మనోభావాలను దెబ్బతీసే లేదా కులం, మతానికి సంబంధించిన అశ్లీల, అవమానకరమైన సందేశాలు, పోస్టర్లు, ఫోటోలను ప్రదర్శించడం మోటారు వాహనాల చట్టం ప్రకారం అనుమతించబడదని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. అలాగే మోటారు వాహనాల చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్లేట్‌తో సహా కారు లేదా ద్విచక్రవాహనంపై ఎక్కడా స్టిక్కర్ లేదా సందేశం లేదా మరేదైనా అతికించకూడదన్నారు.

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179(1) ప్రకారం వాహనాలపై కులం, మతం వారీగా స్టిక్కర్లు, రాతలు వాడకూడదని పేర్కొన్నారు. హ్యుందాయ్ కారుపై ఉన్న స్టిక్కర్‌ని మొదట్లో లైట్ తీసుకున్నా.. ద్వేషం, స్త్రీవివక్షతో అర్థం వచ్చేలా ఉండటంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. వెంటనే కోల్‌కతా పోలీసుల సూచనతో కారు యజమాని స్టిక్కర్ తొలగించాడు. ఉత్తరప్రదేశ్‌లోనూ కుల, మత చిహ్నాలను ఉపయోగించే కార్ల యజమానులకు రూ.1,000 జరిమానా విధిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








