పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

భారతదేశంలో గత కొన్ని నెలలుగా ప్రతి రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. అయితే సుమారు తొమ్మిది వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎట్టకేలకు పెరిగిపోతున్నాయి.

పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

ఇటీవల తమిళనాడు, కేరళ, పాండిచేరి, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత, చమురు కంపెనీలు మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచనున్నాయి. భారతదేశంలో ఇంతకుముందు చివరిసారిగా ఫిబ్రవరి 23 న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచారు.

పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

గత ఫిబ్రవరి నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మానేశాయి. కానీ ఇటీవల ఎన్నికలు ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు.

MOST READ:ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..

పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెనుభారంగా మారాయి. నేడు, పెట్రోల్ ధరను 19 పైసలు, డీజిల్ ధరను 21 పైసలు పెంచారు. నిన్న పెట్రోల్ ధరను లీటరుకు 15 పైసలు, డీజిల్ లీటరుకు 18 పైసలు పెంచారు.

పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సుమారు 9 వారాల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచని కంపెనీలు నష్టాలను పూడ్చుకునేందుకు సన్నాహాలను సిద్ధం చేస్తూ ఒక్కసారిగా ధరలు పెంచుతున్నారు.

MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్‌తో అక్రమాలకు చెక్..

పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

ఎన్నికల సమయంలో ధరలను నిలకడగా ఉంచి, చమురు కంపెనీలు ఎన్నికలు జరిగిన వెంటనే ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. గత అనేక ఎన్నికలలో చమురు కంపెనీలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. చమురు కంపెనీలు ఈ ధోరణిని అనుసరిస్తున్నాయి, ఎందుకంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎన్నికలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సాధారణ వాహనదారులను మాత్రమే కాకుండా మధ్యతరగతి వారిని కూడా చాలా ఇబ్బందులపాలుచేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమాటిక్ గా పెరుగుతాయి.

MOST READ:వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది

పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

ఈ కారణంగా, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజల పట్టుదలను కేంద్ర ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు తలకు మించిన భారమవుతోంది

Most Read Articles

English summary
Oil Companies Increases Petrol Diesel Price. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X